CWG 2022: ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్-pv sindhu and kidambi srikanth enters into badminton singles prequarters ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022: ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

CWG 2022: ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

Maragani Govardhan HT Telugu
Aug 04, 2022 07:07 PM IST

బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. సింగిల్స్‌లో సింధు. శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సునాయస విజయాలతో ముందడుగు వేశారు.

<p>పీవీ సింధు&nbsp;</p>
పీవీ సింధు (AP)

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. 32వ రౌండులో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్‌పై విజయం సాధించింది. ఫలితంగా ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై సునాయస విజయాన్ని అందుకుంది సింధు. ఈ ఒలింపిక్ పతక విజేత మాల్దీవుల క్రీడాకారిణిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

yearly horoscope entry point

ఈ మ్యాచ్‌లో ఫాతిమాపై సింధు 21-4, 21-11 తేడాతో విజయం సాధించింది. కేవలం 21 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి సునాయసంగా గెలిచేసింది. తొలి సెట్‌లో ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన సింధు.. బెంబేలెత్తించింది. ఫాతిమా కేవలం 4 పాయింట్లే సాధించిందంటే ఆ సెట్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ సింధు పుంజుకుంది.

9-9 తేడాతో సమంగా ఉన్న గేమ్‌ను భారత షట్లర్ మరో సారి తన ప్రతాపం చూపించింది. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అక్కడ నుంచి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. బ్రేక్ తర్వాత సింధు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వరుస పెట్టి షాట్లు కొడుతూ పాయింట్లు సాధించింది. ఫలితంగా ఆ సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌లో విజయాన్ని అందుకుందీ తెలుగు తేజం. గత కామన్వెల్త్ ఎడిషన్‌లో రజతాన్ని గెలిచిన సింధు.. ఈ సారి మాత్రం ఎలాగైన పసిడిని చేజిక్కించుకునేందు శతవిధాల కష్టపడుతోంది.

మరోపక్క కిదాంబీ శ్రీకాంత్ కూడా విజయాన్ని అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ 32వ రౌండులో ఉగాండాకు చెందిన డేియల్ వాంగాలియాపై విజయం సాధించాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ సులభంగా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. 21-9, 21-9 తేడాతో రెండు వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. గత సీజన్‌లో వెండి పతకాన్ని అందుకున్న శ్రీకాంత్ స్వర్ణంపై గురిపెట్టాడు.

 

Whats_app_banner

సంబంధిత కథనం