Novak Djokovic Fine: జోకొవిచ్‌కు దిమ్మదిరిగే షాక్.. రికార్డు జరిమానా విధించిన ఆర్గనైజర్స్
Novak Djokovic Fine: జోకొవిచ్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. అతనికి రికార్డు జరిమానా విధించారు వింబుల్డన్ ఆర్గనైజర్లు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాకెట్ విరగ్గొట్టడమే దీనికి కారణం.
Novak Djokovic Fine: టెన్నిస్ ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన మేల్ ప్లేయర్ నొవాక్ జోకొవిచ్. ఇప్పటికే 23 టైటిల్స్ గెలిచి.. 24వ టైటిల్ సాధించే క్రమంలో చివరి మెట్టుపై బోల్తా పడ్డాడు. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతుల్లో వింబుల్డన్ ఫైనల్లో అతడు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి తోడు అతనికి ఇప్పుడు రికార్డు స్థాయి జరిమానా కూడా విధించారు.
ఈ ఫైనల్లో భాగంగా మ్యాచ్ మధ్యలో సహనం కోల్పోయిన జోకొవిచ్.. తన రాకెట్ విరగ్గొట్టాడు. నెట్ పోస్ట్ కే తన రాకెట్ ను బలంగా కొట్టడంతో అది విరిగిపోయింది. దీనిపై అప్పటికప్పుడే అంపైర్ ఫెర్గుస్ మర్ఫీ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్ తర్వాత వింబుల్డన్ నిర్వాహకులు జోకొవిచ్ కు ఏకంగా 8 వేల డాలర్ల జరిమానా విధించడం గమనార్హం.
2023లో ఇదే అత్యధిక జరిమానా. ఈ విషయంలో ఈ సెర్బియన్ సెన్సేషన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టెన్నిస్ కోర్టులో జోకొవిచ్ ఇలా సహనం కోల్పోవడం, రాకెట్లు విరగ్గొట్టడం ఇదే తొలిసారి కాదు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినా, వరల్డ్ నంబర్ వన్ గా ఎదిగినా.. కోర్టులో ఇలాంటి పనులతో అతడు తరచూ విమర్శల పాలవుతూనే ఉంటాడు.
ఇప్పటికే ఏడు వింబుల్డన్ టైటిల్స్ గెలిచి, ఫైనల్లో ఎనిమిదో టైటిల్ పై ఆశతో బరిలోకి దిగిన జోకొవిచ్ కు అల్కరాజ్ షాకిచ్చాడు. తొలి సెట్ గెలిచిన తర్వాత కూడా జోకొవిచ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయాడంటే అల్కరాజ్ ఏ స్థాయిలో ఫైట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్లో జోకొవిచ్ తొలిసారి ఇలా తొలి సెట్ గెలిచినా మ్యాచ్ ఓడిపోయాడు.
అటు కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అల్కరాజ్.. జోకొవిచ్ లాంటి స్టార్ ప్లేయర్ ను ఓడించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్ తర్వాత జోకోవిచ్ మాట్లాడుతూ.. అతడు నదాల్, ఫెదరర్, తనలోని క్వాలిటీస్ ను మిక్స్ చేస్తే తయారైన ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు.
సంబంధిత కథనం