Novak Djokovic Rafael Nadal: ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్.. జోకొవిచ్, నదాల్ సెల్ఫీ వైరల్-novak djokovic rafael nadal selfie gone viral tennis legends on same flight to usa tennis news in telugu ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Novak Djokovic Rafael Nadal Selfie Gone Viral Tennis Legends On Same Flight To Usa Tennis News In Telugu

Novak Djokovic Rafael Nadal: ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్.. జోకొవిచ్, నదాల్ సెల్ఫీ వైరల్

Hari Prasad S HT Telugu
Feb 24, 2024 08:50 AM IST

Novak Djokovic Rafael Nadal: ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్ జోకొవిచ్, నదాల్ అనుకోకుండా ఒకే ఫ్లైట్ లో కలిశారు. సెల్ఫీ దిగారు. దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇంకేం అది కాస్తా వైరల్ అయింది.

ఒకే ఫ్లైట్ లో అమెరికా వెళ్తూ సెల్ఫీ దిగిన టెన్నిస్ లెజెండ్స్ రఫేల్ నదాల్, నొవాక్ జోకొవిచ్
ఒకే ఫ్లైట్ లో అమెరికా వెళ్తూ సెల్ఫీ దిగిన టెన్నిస్ లెజెండ్స్ రఫేల్ నదాల్, నొవాక్ జోకొవిచ్

Novak Djokovic Rafael Nadal: సమకాలీన టెన్నిస్ లో లెజెండరీ ప్లేయర్స్ అయిన నొవాక్ జోకొవిచ్, రఫేల్ నదాల్ అనుకోకుండా ఒకే ఫ్లైట్ లో కలిశారు. దీంతో జోకొవిచ్ తన సీట్లో నుంచి లేచి వెళ్లి నదాల్ ను కలిశాడు. ఇద్దరూ సెల్ఫీ దిగారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇద్దరూ అమెరికాలో ప్రారంభం కాబోయే హార్డ్ కోర్టు సీజన్ కోసం వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

జోకొవిచ్, నదాల్ సెల్ఫీ

టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో జోకొవిచ్, నదాల్ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. టెన్నిస్ లో అత్యున్నతమైనదిగా భావించే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను అత్యధికంగా గెలిచిన ప్లేయర్ జోకొవిచ్. అతని తర్వాతి స్థానంలో ఉన్న ప్లేయర్ రఫేల్ నదాల్. జోకొవిచ్ 24, నదాల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం విశేషం. అలాంటి ఇద్దరు ప్లేయర్స్ ఇలా ఒకే విమానంలో అనుకోకుండా కలవడం నిజంగా ఊహించనిదే.

తాను నదాల్ తో కలిసి దిగిన సెల్ఫీని జోకొవిచ్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులే అయినా.. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఈ ఫొటో చూస్తే తెలుస్తుంది. నిజానికి ఈ ఇద్దరూ వెళ్తున్నది కూడా కోర్టులో తలపడటానికే. సన్‌షైన్ డబుల్ గా పిలిచే ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామీ ఓపెన్ లలో వీళ్లు తలపడనున్నారు.

రికార్డు టైటిల్‌పై జోకొవిచ్ గురి

ఇప్పటి వరకూ ఇండియన్ వెల్స్ టైటిల్ ను నొవాక్ జోకొవిచ్ ఐదుసార్లు గెలిచాడు. ఇప్పుడు రికార్డు ఆరో టైటిల్ పై కన్నేశాడు. అమెరికాలో ఇప్పుడు ఉండే హాట్ కండిషన్స్ లో ఇండియన్ వెల్స్ ఓపెనర్, మియామీ ఓపెన్ వరుసగా జరుగుతాయి. అక్కడి కండిషన్స్ ప్లేయర్స్ కు కఠినమైన సవాలు విసురుతాయి. ఈ సన్‌షైన్ డబుల్ టైటిల్స్ ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లలో జోకొవిచ్ తోపాటు స్టెఫీ గ్రాఫ్, రోజర్ ఫెదరర్ ఉన్నారు.

గ్రాండ్‌స్లామ్ టోర్నీలు కాకుండా బయట అతి పెద్ద టెన్నిస్ టోర్నీల్లో ఒకటిగా మియామీ ఓపెన్ కు పేరుంది. ఈ టోర్నీని గతేడాది 3.86 లక్షల మంది చూడటం విశేషం. అక్కడి హార్డ్ కోర్టు, వేడి ప్లేయర్స్ కు పరీక్ష పెడతాయి. ఇప్పుడీ కఠినమైన సన్ షైన్ డబుల్స్ కోసం జోకొవిచ్, నదాల్ సిద్ధమవుతున్నారు. అక్కడికి వెళ్తూ ఇద్దరూ ఒకే విమానంలో కలవడంతో ఒకరిని చూసి మరొకరు ఆశ్చర్యపోయారు.

జోకొవిచ్, నదాల్ ఇద్దరూ కలిసి దిగిన ఈ సెల్ఫీ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. నొవాక్ ఈ ఫొటో షేర్ చేయగానే లక్షల లైక్స్ వచ్చాయి. జోకొవిచ్ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సన్ షైన్ డబుల్ టూర్ కి వెళ్లాడు.

WhatsApp channel