
(1 / 5)
టెన్నిస్ లెజెండ్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్.. 24 ఏళ్ల తన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించారు. చాలా అద్భుత విజయాలు దక్కించుకున్నారు. 2022లో ఆట నుంచి రిటైర్ అయ్యారు.
(AP)
(2 / 5)
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రోజర్ ఫెదరర్‌పై డాక్యుమెంటరీ రానుంది. ఫెదరర్ కెరీర్లో చివరి 12 రోజులపై ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ఉంటుంది.
(AFP)
(3 / 5)
అలాగే, ఫెదరర్ గురించి రఫేల్ నాదల్, నొవాక్ జకోవిచ్, ఆండ్రీ ముర్రే లాంటి స్టార్ ప్లేయర్లు మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా ఈ డాక్యుమెంటరీలో ఉండనున్నాయి.
(Twitter)
(4 / 5)
రోజర్ ఫెదరర్ డాక్యుమెంటరీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే, డేట్ ఇంకా ఖరారు కాలేదు. జూలైలో వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ భారత సంతతి బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారు.
(AP)
(5 / 5)
రోజర్ ఫెదరర్ తన కెరీర్లో ఏకంగా 20 గ్రాండ్‍స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఇందులో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు ఉన్నాయి. కెరీర్లో 310 వారాల పాటు ప్రపంచ నంబర్ 1 ర్యాంకులో ఫెదరర్ ఉన్నారు. ప్రొఫెషనల్ టెన్నిస్‍లో ఫెదరర్ మొత్తంగా 103 సింగిల్స్ టైటిల్స్ గెలిచారు. టెన్నిస్ చరిత్రలో ఒకానొక గ్రేటెస్ట్ ప్లేయర్‌గా నిలిచారు. 24 ఏళ్ల ఆట తర్వాత 2022లో రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు