Nora Fatehi in FIFA World Cup: ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో నోరా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌-nora fatehi in fifa world cup to perform in closing ceremony ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nora Fatehi In Fifa World Cup: ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో నోరా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌

Nora Fatehi in FIFA World Cup: ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో నోరా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌

Hari Prasad S HT Telugu
Oct 06, 2022 12:06 PM IST

Nora Fatehi in FIFA World Cup: ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో పర్ఫామ్‌ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ యాక్టర్‌గా ఆమె నిలవడం విశేషం.

బాలీవుడ్ నటి నోరా ఫతేహి
బాలీవుడ్ నటి నోరా ఫతేహి (PTI)

Nora Fatehi in FIFA World Cup: బాలీవుడ్‌లో తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న నటి నోరా ఫతేహి.. ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. దిల్‌బర్‌ దిల్‌బర్‌ సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆమె.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ స్టేజ్‌కు తన టాలెంట్‌ను తీసుకెళ్తోంది.

ఫిఫా వరల్డ్‌కప్‌ క్లోజింగ్‌ సెర్మనీలో నోరా ఫతేహి పర్ఫార్మ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్‌ టోర్నీలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్న తొలి వ్యక్తిగా నోరా నిలుస్తుంది. అంతేకాదు జెన్నిఫర్‌ లోపెజ్‌, షకీరా, పిట్‌బుల్‌లాంటి ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ సరసన నోరా నిలవనుంది.

ప్రస్తుతానికైతే ఆమె పర్ఫార్మెన్స్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెల్లడించకపోయినా.. ఇప్పటికే ఆమె కాంట్రాక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. గతంలో షకీరా ఫిఫా వరల్డ్‌ కప్‌ కోసం చేసిన వాకా వాకా ఆల్బమ్‌ను ప్రొడ్యూస్‌ చేసిన రెడ్‌వన్‌తో కలిసే నోరా ఇప్పుడు సాంగ్‌ను చేస్తున్నట్లు జీన్యూస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఇక ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ క్లోజింగ్‌ సెర్మనీలోనూ నోరా ఫతేహి లైవ్‌లో పర్ఫార్మ్‌ చేయనుంది.

ఇక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం రూపొందిన ఆంథెమ్‌లోనూ నోరా నటించింది. దీనికి సంబంధించి గ్లింప్స్‌ వీడియోను నోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అక్టోబర్‌ 7న ఈ ఆంథెమ్‌ రిలీజ్‌ కాబోతోంది. అధికారిక ఫిఫా వరల్డ్‌కప్‌ ఆంథెమ్‌ లైట్‌ ద స్కైలో తాను ఉన్నట్లు నోరా వెల్లడించింది. ఈ న్యూస్‌ చూసిన నోరా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ప్రపంచంలో నోరా పర్ఫెక్ట్‌ డ్యాన్సర్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకూ ఖతార్‌లో జరగనుంది.

మరోవైపు బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న థ్యాంక్‌ గాడ్‌ మూవీలో నోరా ఫతేహి ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఈ సినిమా అక్టోబర్‌ 24న రిలీజ్‌ కాబోతోంది. అటు ఝలక్‌ దిఖ్‌లా జా అనే తన రియాల్టీ షోతోనూ నోరా బిజీగా ఉంది.

WhatsApp channel

టాపిక్