Neeraj Chopra watch: నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు-neeraj chopra wore 52 lakhs worth watch for olympics 2024 javelin throw final he won silver medal ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra Watch: నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు

Neeraj Chopra watch: నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు

Hari Prasad S HT Telugu
Aug 12, 2024 11:51 AM IST

Neeraj Chopra watch: పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా తన చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్ పెట్టుకున్నాడట. ఈ వాచ్ తోనే అతడు ఫైనల్ బరిలోకి దిగడం విశేషం.

నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు
నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు

Neeraj Chopra watch: నీరజ్ చోప్రా ఇండియా చూసిన అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడు అనడంలో సందేహం లేదు. వరుస ఒలింపిక్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న ఈ స్టార్.. మూడేళ్లుగా ఓ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు తగినట్లే అతడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటూ తాజాగా అతని చేతికి ఉన్న రూ.52 లక్షల విలువైన వాచ్ చూస్తే అర్థమవుతోంది.

నీరజ్ చేతికి లక్షల విలువైన వాచ్

నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్లో తలపడి సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మెడల్ కంటే ఎక్కువగా ఇప్పుడు అతడు తన చేతికి పెట్టుకున్న వాచ్ ఆకర్షిస్తోంది. ఈ వాచ్ ఖరీదు ఏకంగా రూ.52 లక్షలు అని కొందరు నెటిజన్లు తేల్చేశారు. సెలబ్రిటీల వాచీలను ట్రాక్ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ రెడిట్ ఫోరమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

నీరజ్ చోప్రా ఒమెగా బ్రాండ్ కు చెందిన రూ.52 లక్షల విలువైన వాచ్ పెట్టుకున్నట్లు కొందరు తేల్చేశారు. అంతేకాదు అది ఒమెగా సీమాస్టర్ ఆక్వా టెర్రా 150 ఎం మోడల్ అని కూడా స్పష్టంగా చెప్పడం విశేషం. ఈ విషయాన్ని లగ్జరీ వాచీలు అమ్మే కపూర్ వాచ్ కంపెనీ కూడా ధృవీకరించింది. ఆ వాచ్ వివరాలను తమ వెబ్‌సైట్లో కూడా ఉంచింది.

నిజానికి స్విస్ వాచ్‌మేకర్ అయిన ఒమెగా ఈ ఏడాది మొదట్లోనే నీరజ్ చోప్రాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఇలాంటి ఐకానిక్ బ్రాండ్ లో భాగంగా కావడం తనకు చాలా ఉత్సాహంగా ఉందని అప్పట్లో నీరజ్ అన్నాడు.

అప్పుడు గోల్డ్.. ఇప్పుడు సిల్వర్

టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తో చరిత్ర సృష్టించి రాత్రికి రాత్రే దేశంలో ఓ హీరోగా మారిపోయిన నీరజ్ చోప్రా.. పారిస్ లోనూ అదే రిపీట్ చేసేలా కనిపించాడు. నిజానికి తన సీజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. అయితే అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ ఎగరేసుకుపోయాడు.

అయితే అథ్లెటిక్స్ లో రెండు వరుస ఒలింపిక్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్ గెలిచిన ఏకైక ఇండియన్ అథ్లెట్ గా నీరజ్ నిలిచాడు. ఈ దెబ్బతో అతని ఇమేజ్ మరింత పెరిగిపోనుంది. ప్రస్తుతం మన దేశంలో క్రికెట్ స్టార్లకు ఉండే క్రేజ్ ను నీరజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో అతని బ్రాండ్ వాల్యూ కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.