Lyon Breaks warne record: లియోన్ అరుదైన ఘనత.. వార్న్ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ స్పిన్నర్.. భారత్ ఆలౌట్-nathan lyon break shane warne record became most wicket taker in asia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lyon Breaks Warne Record: లియోన్ అరుదైన ఘనత.. వార్న్ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ స్పిన్నర్.. భారత్ ఆలౌట్

Lyon Breaks warne record: లియోన్ అరుదైన ఘనత.. వార్న్ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ స్పిన్నర్.. భారత్ ఆలౌట్

Maragani Govardhan HT Telugu
Mar 01, 2023 12:50 PM IST

Lyon Breaks warne record: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన షేన్ వార్న్(127) రికార్డును అధిగమించాడు. జడేజా వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నాడు.

నాథన్ లియోన్.
నాథన్ లియోన్. (AFP)

Lyon Breaks warne record: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి భారత టాపార్డర్, మిడిలార్డర బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న ఈ పిచ్ అనూహ్యంగా స్పిన్‌‌కు అనుకూలించడంతో ఆసీస్ స్పిన్నర్లు చెలరేగుతున్నారు. కంగారూ స్పిన్నర్లు మ్యాథ్యూ కుహ్నేమన్, నాథన్ లియోన్ వరుస వికెట్లు తీస్తూ విజృంభిస్తున్నారు. వీరిద్దరి ధాటికి భారత బ్యాటర్లు వరుసాగ పెవిలియన్ చేరుతున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. మ్యాథ్యూ కుహ్నేమన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే పుజారా నాథన్ లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాను కూడా ఔట్ చేశాడు లియోన్. ఆ కాసేపటికే శ్రేయాస్ అయ్యర్‌ను కుహ్నేమన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. భారత్.

ఆ కాసేపటికే విరాట్ కోహ్లీని కూడా టాడ్ మర్ఫీ ఎల్బీడబ్ల్యూ చేయగా.. ఆ తర్వాత లియోన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లంచ్ విరామానికే 82 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది భారత్. రెండో సెషన్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ వేగంగా సాగలేదు. లంచ్ బ్రేక్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ను కుహ్నేమన్ ఔట్ చేశాడు. దీంతో 88కే 8 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో పేసర్ ఉమేశ్ యాదవ్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దగాడు. వరుస సిక్సర్లతో విరుచుకపడటంతో టీమిండియా స్కోరు 100 పరుగులు దాటింది. ఫలితంగా 109 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. చివరి వికెట్ మహమ్మద్ సిరాజ్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఆసీస్ స్పిన్నర్ కుహ్నేమన్ 5 వికెట్లతో రాణించగా.. లియోన్ 3 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో నాథన్ లియోన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 128 వికెట్లతో షేన్ వార్న్ పేరిట ఉన్న 127 వికెట్ల రికార్డును అధిగమించాడు. నాథన్ లియోన్.. పుజారా, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జడ్డూ వికెట్ తీయడంతో వార్న్ రికార్డును బద్దలుకొట్టాడు.

- నాథన్ లియోన్(ఆసీస్ స్పిన్నర్)- 128 వికెట్లు

- షేన్ వార్న్(ఆసీస్ స్పిన్నర్)- 127 వికెట్లు

- డానియెల్ వెటోరి(న్యూజిలాండ్ స్పిన్నర్)- 98 వికెట్లు

- డెయిల్ స్టెయిన్(సౌతాఫ్రికా పేసర్)- 92 వికెట్లు

- జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లాండ్ పేసర్)- 82 వికెట్లు

- కోర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్ పేసర్)- 77 వికెట్లు

Whats_app_banner