Murugan Ashwin Catch: వామ్మో... గాల్లో తేలుతూ క్యాచ్ పట్టిన మురుగన్ అశ్విన్ - వీడియో వైరల్
Murugan Ashwin Catch: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ల్ మధురై పాంథర్స్ ప్లేయర్స్ మురుగన్ అశ్విన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అతడి ఫీల్డింగ్ విన్యాసాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Murugan Ashwin Catch: ఐపీఎల్ 2023 సీజన్‌లో సీనియర్స్ కంటే యంగ్ ప్లేయర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోన్నారు. అదే జోరును ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొనసాగిస్తోన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో అదరగొడుతోన్నారు. దుండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మురుగన్ అశ్విన్ పట్టిన ఓ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
దుండిగల్ డ్రాగన్స్ బ్యాటర్ అరుణ్ ఆఫ్‌సైడ్ గాల్లోకి కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్దకు పరిగెత్తు కుంటూ వెళ్లి అమాంతం గాల్లో తేలుతూ మురుగన్ అశ్విన్ క్యాచ్ పట్టాడు. ఈ మ్యాచ్ చూస్తోన్న అభిమానులు అతడు క్యాచ్ పట్టడం అసాధ్యం అనుకున్నారు.కానీ అద్భుతంగా క్యాచ్ పట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
అతడి మెరుపు ఫీల్డింగ్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మురుగన్ అశ్విన్ ఫీల్డింగ్ నైపుణ్యాల్ని మెచ్చుకుంటున్నారు. ఇంత అద్భుతమైన క్యాచ్ పట్టిన తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు మురుగన్ అశ్విన్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధురై పాంథర్స్ 19 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది.
ఈ సింపుల్ టార్గెట్‌ను దుండిగల్ డ్రాగన్స్ 14 ఓవర్లలోనే ఛేదించింది. దుండిగల్ బ్యాట్స్‌మెన్స్‌లో బాబా ఇంద్రజీత్ 48 బాల్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 రన్స్ చేశాడు. దుండిగల్ టీమ్‌కు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం.