Ranji Trophy Winner: సౌరాష్ట్రకు రెండో రంజీ ట్రోఫీ టైటిల్ అందించిన జయదేవ్ ఉనద్కత్ - ఫైనల్లో బెంగాల్ చిత్తు
Ranji Trophy Winner 2023: 2022-23 రంజీ ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. ఫైనల్‌లో బెంగాల్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నది.
Ranji Trophy Winner: పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ విజృంభించడంలో సౌరాష్ట్ర రంజీ టైటిల్ దక్కించుకున్నది. బైంగాల్‌తో జరిగిన ఫైనల్‌లో సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 2019-20లో బెంగాల్‌పై గెలిచి తొలిసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచింది. మరోసారి బెంగాల్‌ను జోడించి టైటిల్ కైవసం చేసుకొని చరిత్రను సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన పేసర్ జయదేవ్ ఉనద్కత్ సౌరాష్ట్ర విజయంలో కీలకభూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో బెంగాల్ బ్యాట్స్‌మెన్స్‌లో మనోజ్ తివారీ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా మజుందార్ 61 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 404 పరుగులు చేసింది. వసవడ 81 రన్స్, చిరాక్ జానీ 60, జాక్సన్ 59 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ విధించిన 14 పరుగుల టార్గెట్‌ను సౌరాష్ట్ర సింపుల్‌గా ఛేదించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు జయదేవ్ ఉనద్కత్ ఎంపికయ్యాడు. కానీ రంజీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా అతడిని విడుదలచేసింది.
టాపిక్