Ishan Kishan on Pant Accident: పంత్ ప్రమాదం గురించి తెలియగానే నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో: ఇషాన్
Ishan Kishan on Pant Accident: పంత్ ప్రమాదం గురించి తెలియగానే తన గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలియదని అన్నాడు ఇషాన్ కిషన్. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు మాట్లాడిన ఇషాన్.. ఈ ప్రమాదంపై తొలిసారి స్పందించాడు.
Ishan Kishan on Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జరిగిన కారు ప్రమాదం ఎంత భయానకంగా ఉందో మనందరం చూశాం. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా మంటల్లో కాలిపోగా.. అదృష్టవశాత్తూ పంత్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నా.. కనీసం ఆరు నెలల పాటు క్రికెట్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు.
తాజాగా పంత్‌కు జరిగిన ప్రమాదంపై యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా స్పందించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 ప్రారంభానికి ముందు హర్షా భోగ్లేతో మాట్లాడిన ఇషాన్.. ఈ ప్రమాదం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పాడు. ఈ వార్త వినగానే తన గుండె ఎంత వేగంగా కొట్టుకుందో చెప్పలేనని అతను అన్నాడు.
"నేను మొదటిసారి ఈ వార్త విన్నప్పుడు అదేదో మామూలు ప్రమాదమే అని, దానిని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అనుకున్నాను. కానీ అది ఎంత భయానకంగా జరిగిందో తెలిసిన తర్వాత నేను నిజంగా భయపడ్డాను. రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో చెప్పలేను" అని ఇషాన్ అన్నాడు.
నిజానికి పంత్‌కు ప్రమాదం జరిగిన రోజు ఇషాన్ ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అదే రోజు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతుండగా.. వాళ్లలో ఒకరు పంత్‌కు జరిగిన ప్రమాదం గురించి ఇషాన్‌కు చెప్పారు. ఇది విని ఇషాన్ షాక్ తిన్నాడు. అయితే అప్పటికి అతనికి ఆ ప్రమాద తీవ్రత ఎంతన్న విషయం తెలియదు.
ఇక పంత్ త్వరగా కోలుకోవాలంటూ ప్లేయర్స్ విషెస్ చెప్పిన వీడియోను మంగళవారం బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇందులో ఇషాన్ కూడా ఉన్నాడు. "హాయ్ రిషబ్. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో నిన్ను మిస్ అవుతున్నాము. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. నాకు తెలుసు నువ్వో ఫైటర్‌వని. మరింత బలంగా పుంజుకొని త్వరలోనే వస్తావని ఆశిస్తున్నాను" అని ఆ వీడియోలో ఇషాన్ అన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్