Watson on Virat-Gambhir Fight: విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ గొడవ ఇటీవల కాలంలో సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. లక్నో-బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్‌లో మ్యాచ్‌లో వీరిద్దరూ మాటల యుద్ధం చేసుకోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరు దూసుకెళ్లేంత వరకు సంఘర్షణ చోటు చేసుకుంది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా ఇరువురు పరోక్షంగా పదునైన మాటలతో పరోక్షంగా నిందించుకున్నారు. వీరి ప్రవర్తనను పలువురు మాజీలు సైతం తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ కూడా స్పందించాడు.
"మైదానంలో పోటీతత్వంతో ఉండటం బాగుంటుందిది. కాంపీటీటివ్‌గా ఉండటానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అప్పుడే ఆటగాళ్లు వారి బెస్ట్ ఇస్తారు. ఇది వారి ప్రవృత్తులను మెరుగుపరచడమే కాకుండా ఫోకస్‌ను పెంచుతుంది. కానీ మైదానం వెలుపల మాత్రం ఇలాంటి హీటెడ్ ఆర్గ్యూమెంట్లను వదిలేయాలి." అని షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
మైదానంలో మనుగడ కోసం పోరాడాల్సి ఉంటుందని వాట్సన్ తెలిపాడు. "గ్రౌండ్‌లో మీరు ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆటగాళ్ల మధ్య కొన్ని విభేదాలు రావచ్చు. కానీ ఆట పూర్తయిన తర్వాత వాటన్నింటిని అక్కడితో వదిలేసి ముందుకెళ్లాలి. విరాట్-గంభీర్ విషయంలో ఏదైతే జరిగిందో అలాంటి ఘర్షణను ఎవ్వరూ చూడాలనుకోరు. గంభీర్ అసలు ఇప్పుడు క్రికెట్ కూడా ఆడట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి అవసరం లేదు." అని వాట్సన్ తెలిపాడు.
ఇటీవలే బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ నవీన్ ఉల్ హఖ్‌పై కోహ్లీ పదే పదే కామెంట్లు చేశాడు. దీంతో విరాట్‌పై అమిత్ మిశ్రా ఫీల్డ్ అంపైర్‌కు కంప్లైట్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్.. విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు గంభీర్ వచ్చేసి కైల్ మేయర్స్‌ను లాక్కుని వెళ్లాడు. కోహ్లీతో మాట్లాడకుండా అతడిని గంభీర్ తీసుకెళ్లడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ఆ సమయంలో కోహ్లీ ఏదో అనడం, గంభీర్ తిరిగి అతడిపైకి వెళ్లడంతో సంఘర్షణ చోటు చేసుకుంది.