Rahane Shots Viral: కళ్లు చెదిరే షాట్లతో అలరించిన రహానే.. బ్యాటింగ్‌తో రహానే విధ్వంసం-rahane ridiculous shot during csk vs kkr match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahane Shots Viral: కళ్లు చెదిరే షాట్లతో అలరించిన రహానే.. బ్యాటింగ్‌తో రహానే విధ్వంసం

Rahane Shots Viral: కళ్లు చెదిరే షాట్లతో అలరించిన రహానే.. బ్యాటింగ్‌తో రహానే విధ్వంసం

Maragani Govardhan HT Telugu
Apr 23, 2023 10:41 PM IST

Rahane Shots Viral: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అజింక్య రహానే కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. అద్భుతమైన ట్రెడిషనల్ షాట్లతో పాటు రివర్స్ స్కూప్ లాంటి ట్రెండీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా చెన్నై 235 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

అజింక్య రహానే
అజింక్య రహానే (CSK Twitter)

Rahane Shots Viral: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే(71), శివమ్ దూబే(50), డేవాన్ కాన్వే(56) అర్ధశతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా రహానే 29 బంతుల్లో 71 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 5 సిక్సర్లు, 6 ఫోర్లతో విధ్వంసం సృష్టించిన రహానేపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అతడు కొట్టిన చూడముచ్చటైన షాట్లకు క్రికెట్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

చెన్నై ఓపెనర్లు డేవాన్ కాన్వే-రుతురాజ్ గైక్వాడ్ 73 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం నెలకొల్పిన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే వచ్చి రావడంతో విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా బ్యాట్ ఝుళిపించాడు. తనదైన శైలి టెర్రిఫిక్ బ్యాటింగ్‍‌తో ఆకట్టుకున్నాడు. 14వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో చూడముచ్చటైన షాట్లతో అదరగొట్టాడు. ఇంక 18వ ఓవర్ వేసిన కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన లో ఫుల్ టాస్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌండరీకి తరలించాడు. రివర్స్ స్కూప్ షాట్ సాయంతో అద్భుతంగా ఆడాడు.

ఎప్పుడూ క్లాసీ షాట్లే ఆడే రహానే.. ఈ మ్యాచ్‌లో తనశైలికి విరుద్ధంగా స్కూప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. థర్డ్ మ్యాన్ దిశగా అతడు కొట్టిన షాట్‌కు ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు కూడా ఫిదా అయ్యారు. వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్న రవిశాస్త్రీ, సైమన్ డౌల్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆ షాట్ ఎంత బాగుంది? బంతి నేరుగా కోల్‌కతా డగౌట్‌లోకి వెళ్ల పడిదంని రవిశాస్త్రీ అనగా.. రీప్లేలో చూసిన సైమన్ డౌల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అది ఎలా వెళ్లిందో నాకు అర్థం కావట్లేదని తెలిపాడు. వీళ్లే కాకుండా పలువురు మాజీలు కూడా రహానే బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 235 పరుగుల భారీ స్కోరును నిర్దేశించింది. రహానే, కాన్వే, శివమ్ దూబే ముగ్గురు అర్ధ సెంచరీలతో విజృంభించడంతో కేకేఆర్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కోల్‌కతా బౌలర్లలో కుల్వత్ 2 వికెట్లు తీయగా.. వరుణమ్ చక్రవర్తి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

WhatsApp channel