IPL Media Rights:ఒక్కో మ్యాచ్ కు 107 కోట్లు...భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్-ipl media rights sold for 44075 crore rupees ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Media Rights:ఒక్కో మ్యాచ్ కు 107 కోట్లు...భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్

IPL Media Rights:ఒక్కో మ్యాచ్ కు 107 కోట్లు...భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 08:14 PM IST

ఐపీఎల్ మీడియా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. టీవీ, డిజిటల్ హక్కులను వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి.ఈ వేలం ద్వారా బీసీసీఐకి 44075 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నది.

<p>ఐపీఎల్</p>
ఐపీఎల్ (twitter)

ఐపీఎల్ రూపంలో బీసీసీఐపై కాసుల వర్షం కురిసింది. ఇప్పటికే ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ గా ఉన్న బీసీసీఐ కి ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో( IPL Media Rights) 44వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరనుంది. 2023 నుండి 2027 వరకు ఐదేళ్ల పాటు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఆదివారం బీసీసీఐ ఈ వేలాన్ని ప్రారంభించింది.

 రెండు రోజుల పాటు సాగిన ఈ వేలం పాట సోమవారం ముగిసింది. ప్యాకేజ్ ఏ, ప్యాకేజ్ బీ రూపంలో టీవీ, డిజిటల్ ప్రసారాలకు వేర్వేరుగా ధరలు ఫిక్సయ్యాయి. టీవీ హక్కులకు 23 575 కోట్లు నిర్ణయంకాగా డిజిటల్ హక్కుల 20500 కోట్లకు అమ్ముడుపోయాయి. వేర్వేరు ప్రసార సంస్థలు ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

 మొత్తం ఈ మీడియా హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐకి 44075 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఒక్కో మ్యాచ్ కు 107.5 కోట్ల ఆదాయం రానుంది.  ఈ హక్కుల కోసం వయాకామ్ 18, డిస్నీ హాట్ స్టార్, సోనీ, జీ తో పాటు అమెజాన్  తో పాటు పలు సంస్థలు పోటీపడ్డాయి. స్టార్ స్పోర్ట్స్, సోనీ సంస్థలు చివరి వరకు బరిలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.  సోనీ టీవీకి టీవీ హక్కులు, స్టార్ నెట్ వర్క్ కు డిజిటల్ రైట్స్ దక్కినట్లు సమాచారం. 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్