India vs Australia Toss: టాస్ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్
India vs Australia: నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలుపు కోసం రెండు జట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
India vs Australia 2nd T20I: ఆస్ట్రేలియాతో నేడు జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నాగ్‌పుర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి టీ20లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యోచిస్తోంది. మరోపక్క సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు గెలుపుకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
విదర్బ మైదానం అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్ టాస్ మూడు గంటల పాటు ఆలస్యమైంది. ఈ కారణంగా రిఫరీ మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇరు జట్లకు చెరో 8 ఓవర్లు ఆడే అవకాశాన్ని కలగజేశారు. ఇందులో అత్యధికంగా ఏ బౌలరైన రెండు ఓవర్లు మాత్రమే వేసే అవకాశముంది. రెండు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులు చేసింది. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వీరి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించింది. మరోపక్క ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. ఎల్లిస్ గాయపడిన కారణంగా అతడి స్థానంలో సామ్స్ రానుండగా.. సీన్ అబాట్ స్థానంలో ఇంగ్లీస్‌ను తీసుకున్నారు.
తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన టీమిండియా.. ఈ సారి కొత్త వ్యూహాలతో బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌కు అడ్డుకట్ట వేయాలంటే భారత్ తన లోపాలన్నీ సరిదిద్దుకున్న అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
గత మ్యాచ్‌లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా నిరాశ పరిచాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కూడా ఆకట్టుకోలేదు. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ నిరాశ పరిచాడు. దీంతో అతడి స్థానంలో రిషభ్ పంత్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలు భారత జట్టును ఇబ్బంది పెడుతోంది. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారీ మూల్యం సమర్పించుకోవాల్సి వచ్చింది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్ చేతిలో పడిన క్యాచ్‌లను జారవిడిచారు.
తుది జట్లు..
భారత్..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్
ఆస్ట్రేలియా..
ఆరోన్ ఫించ్(కెప్టెన్), కేమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, టిమ్ డేవిడ్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, సామ్స్, ఆడం జంపా, జోష్ హేజిల్‌వుడ్.
సంబంధిత కథనం