Asian Games 2023: భారత్‍ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు-india wins gold medal in 10 meter air pistol team event in asian games 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asian Games 2023: భారత్‍ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు

Asian Games 2023: భారత్‍ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు

Sanjiv Kumar HT Telugu
Sep 28, 2023 10:11 AM IST

Bharat Gold Medals Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకు ఐదు గోల్డ్ మెడల్స్ సాధించి దేశానికి గర్వంగా నిలిచిన ఆటగాళ్లు మరో స్వర్ణం తీసుకొచ్చారు. దీంతో భారత్ ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి విజయకేతనం ఎగురవేసింది.

భారత్‍కు మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు
భారత్‍కు మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియన్ గేమ్స్ 2023లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. వరుసగా మెడల్స్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. చేనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇండియా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించగా.. తాజాగా మరొకటి భారత్ ఖాతాలో జమ అయింది. గురువారం మరో బంగారు పతకాన్ని భారత్ షూటర్స్ సొంతం చేసుకున్నారు.

1734 పాయింట్లతో

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్‍లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమాతో కూడిన భారత బృందం గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమా 1734 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఇండియా అకౌంట్‍లోకి మరో స్వర్వ పతకం వచ్చి చేరింది.

ఐదో స్థానంలోకి

భారత్‍కు తాజాగా మరో గోల్డ్ మెడల్ రావడంతో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు వచ్చాయి. అందులో నాలుగు మెడల్స్ షూటింగ్‍లో రావడం విశేషం. ఆసియన్ గేమ్స్ 2023లో ఇప్పటికీ మొత్తంగా భారత్ 24 పతకాలతో ఐదో స్థానంలో ఉంది. బుధవారం వచ్చిన నాలుగు మెడల్స్ తో ఆరో స్థానంలో కొనసాగిన భారత్ ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చింది. భారత్‍కు వచ్చిన 24 పతకాల్లో గోల్డ్ 6, సిల్వర్ 8, బ్రాంజ్ 10 మెడల్స్ ఉన్నాయి.

మొదటి రెండు స్థానాల్లో

అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‍లో 1733 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆతిథ్య చైనా మరో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. దీంతో మొత్తంగా 146 మెడల్స్ (గోల్డ్ 81, సిల్వర్ 44, బ్రాంజ్ 21) సాధించి ఆసియన్ 2023 క్రీడల్లో మొదటి స్థానంలో చైనా నిలిచింది. ఇక రెండో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా 71 పతకాలతో కైవసం చేసుకుంది.

Whats_app_banner

టాపిక్