India vs Bangladesh 1st Test Day 3: బంగ్లాదేశ్ 150 ఆలౌట్.. కుల్దీప్‌కు 5 వికెట్లు.. ఫాలో ఆన్ ఆడించని ఇండియా
India vs Bangladesh 1st Test Day 3: బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 254 పరుగులు ఆధిక్యం లభించింది.
India vs Bangladesh 1st Test Day 3: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. మూడో రోజు 8 వికెట్లకు 133 రన్స్ ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన బంగ్లా టీమ్ మరో 17 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ మూడో రోజు మరో వికెట్‌తో ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
చట్టోగ్రామ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఇక కాసేపు విసిగించిన మెహదీ హసన్ (25)ను అక్షర్ పటేల్ చివరి వికెట్‌గా వెనక్కి పంపించాడు. ఇండియాకు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించినా.. ఫాలోఆన్ ఆడించకూడదని నిర్ణయించింది. దీంతో ఇండియా తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 రన్స్ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజే బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేసిన ఇండియన్ బౌలర్లు.. మూడో రోజు మిగిలిన రెండు వికెట్లను కూడా త్వరగానే తీసుకున్నారు. కుల్దీప్ 5, సిరాజ్ 3, అక్షర్, ఉమేష్ చెరొక వికెట్ తీశారు. బంగ్లా టీమ్‌లో ముష్ఫికుర్ రహీమ్ 28 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో మెహదీ హసన్ 25 రన్స్ చేసి ఔటయ్యాడు.