India vs Australia Toss Delay: టాస్ మరింత ఆలస్యం.. తడిగా మారిన అవుట్ ఫీల్డ్.. మ్యాచ్‌పై సందిగ్ధం-india vs australia 2nd t20i toss delay due to wet out field ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Australia Toss Delay: టాస్ మరింత ఆలస్యం.. తడిగా మారిన అవుట్ ఫీల్డ్.. మ్యాచ్‌పై సందిగ్ధం

India vs Australia Toss Delay: టాస్ మరింత ఆలస్యం.. తడిగా మారిన అవుట్ ఫీల్డ్.. మ్యాచ్‌పై సందిగ్ధం

Maragani Govardhan HT Telugu
Sep 23, 2022 07:46 PM IST

India Vs Australia 2nd T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో టీ20 టాస్ మరింత ఆలస్యం కానుంది. అవుట్ ఫీల్డ్ కతడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. అంపైర్లు పరిస్థితిని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నారు.

<p>భారత్-ఆస్ట్రేలియా టాస్ ఆలస్యం</p>
భారత్-ఆస్ట్రేలియా టాస్ ఆలస్యం (AFP)

Ind vs Aus Toss Delay: నాగ్‌పుర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో టీ20 మరింత ఆలస్యం కానుంది. వర్షం కారణంగా విదర్భ మైదానం అవుట్‌ఫీల్డ్ తడిగా మారింది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. మొదట ఈ మ్యాచ్ టాస్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు వేయాల్సి ఉండగా.. అవుట్ ఫీల్డ్ సరిగా లేకపోవడంతో పరిస్థితిని పరిశీలించిన అంపైర్లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభించాలని భావించారు. అయితే 7 గంటలకు కూడా సమస్య పరిష్కారం కాలేదు.

తిరిగి మళ్లీ 8 గంటలకు ఇన్‌స్పెక్షన్ చేయనున్నారు. మ్యాచ్ నిర్వహణకు మైదానం సరిగ్గా లేదని భావించిన అంపైర్లు ఈ నిర్ణంయ తీసుకున్నారు. ఈ కారణంగా మ్యాచ్ ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముంది.

మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. దీంతో నాగ్‌పుర్ వేదికగా జరగబోయే మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఎందుకంటే ఇందులో గెలిస్తేనే సిరీస్ రేసులో నిలిచే అవకాశముంటుంది. ఒకవేళ రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓడితే.. వచ్చే ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగబోయే ఆఖరి మ్యాచ్ నామమాత్రంగా మారే అవకాశణుంది. గెలిస్తే.. చివరి మ్యాచ్ కీలకం కానుంది. ఏదైనా ఈ మ్యాచ్ ఫలితంపైన ఆధారపడి ఉంటుంది.

గత మ్యాచ్‌లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా నిరాశ పరిచాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కూడా ఆకట్టుకోలేదు. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ నిరాశ పరిచాడు. దీంతో అతడి స్థానంలో రిషభ్ పంత్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలు భారత జట్టును ఇబ్బంది పెడుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం