ICC Apologises To Fans: క్రికెట్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన ఐసీసీ - ఎందుకో తెలుసా
ICC Apologises To Fans: టెస్టుల్లో టీమ్ ఇండియా నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్నట్లుగా బుధవారం ఐసీసీ సైట్‌లో కనిపించింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ తప్పిదం జరగడంతో అభిమానులకు ఐసీసీ క్షమాపణలు చెప్పింది.
ICC Apologises To Fans: తాము చేసిన తప్పిదానికి క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్షమాపణలు చెప్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా నంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్లు బుధవారం ఐసీసీ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఐసీసీ ప్రకటనతో టీమ్ ఇండియా అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది.
ఇప్పటికే వన్డేల్లో, టీ20ల్లో అగ్ర స్థానంలో ఉన్నటీమ్ ఇండియా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకోవడం గర్వకారణమంటూ ప్రశంసలు కురిపించారు. కానీ సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగానే ఇండియా నంబర్ వన్ ర్యాంకులో ఉన్నట్లుగా కనిపించడంతో ఆ తప్పును నాలుగైదు గంటల తర్వాత సరిదిద్దింది ఐసీసీ. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకులో ఉంది ఆస్ట్రేలియా అని, ఇండియా కాదని చెప్పింది.
టెక్నికల్ ఎర్రర్ కారణంగా సైట్‌లో ఇండియా నంబర్ వన్ ర్యాంకులో ఉన్నట్లుగా చూపించిందని, ఆ తప్పును తొందరగానే సరిదిద్దామని తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా నెలకొన్న ఈ అసౌకర్యానికి చింతిస్తూ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా నంబర్ వన్ ర్యాంకులో ఉండగా సెకండ్ ప్లేస్‌లో ఇండియా ఉంది.మరోవైపు వన్డేల్లో, టీ20ల్లో మాత్రం ఆస్ట్రేలియా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది.