India vs New Zealand : భారత్-న్యూజిలాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్టు వివరాలివే
India Vs New Zealand Schedule 2023 : త్వరలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్ లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ జట్టుకు సారథ్యవహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య కొనసాగుతాడు. షాబాజ్ అహ్మద్ అలాగే శార్దూల్ ఠాకూర్ వచ్చారు.
India Vs New Zealand Schedule : శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో భారత్ ఆడనుంది. జనవరి 18 నుండి మొదలవుతున్న సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేల సిరీస్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. వన్డే సిరీస్‌లలో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20 సిరీస్‌కి ఎంపిక కాలేదు. న్యూజిలాండ్‌పై టి20 సిరీస్‌కు ఇండియా జట్టులో హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీకి స్థానం కల్పించలేదు.
ఇక అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు. ఈ విధంగా టి20 జట్టులో జితేష్ శర్మ, పృథ్వీ షాకు అవకాశం లభించింది. హిట్ మ్యాన్ లేకపోవడంతో టి20 జట్టును హార్దిక్ పాండ్య నడిపిస్తాడు. వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు.
మరోవైపు వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యవహిస్తాడు. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య కొనసాగుతాడు. వన్డే జట్టుకు షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ వచ్చారు. వీరితో పాటు కీపర్, బ్యాటర్ కేఎస్ భరత్ కు అవకాశం లభించింది. భారత్-న్యూజిలాండ్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.
భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్:
మెుదటి వన్డే మ్యాచ్ (హైదరాబాద్) – జనవరి 18
రెండో వన్డే మ్యాచ్ (రాయపురం) – జనవరి 21
మూడో వన్డే మ్యాచ్ (ఇండోర్) – జనవరి 24
భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్ :
మెుదటి టి20 మ్యాచ్ (రాంచి) – జనవరి 27
రెండో టి20 మ్యాచ్ (లక్నో) – జనవరి 29
మూడో టి20 మ్యాచ్ (అహ్మదాబాద్) – ఫిబ్రవరి 1
టీమ్ ఇండియా వన్డే జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్ ), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, షమి, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
టీమ్ ఇండియా T20 జట్టు :
హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వి షా, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రుతురాజ్ గాయక్వాడ్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.