Hardik Surpasses Nadal: హార్దిక్ అరుదైన రికార్డు.. నాదల్‌ను అధిగమించిన స్టార్.. ఫెదరర్ కూడా అతడి తర్వాతే -hardik pandya surpasses rafael nadal roger federer to create spectacular record in instagram ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Surpasses Nadal: హార్దిక్ అరుదైన రికార్డు.. నాదల్‌ను అధిగమించిన స్టార్.. ఫెదరర్ కూడా అతడి తర్వాతే

Hardik Surpasses Nadal: హార్దిక్ అరుదైన రికార్డు.. నాదల్‌ను అధిగమించిన స్టార్.. ఫెదరర్ కూడా అతడి తర్వాతే

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 08:02 AM IST

Hardik Surpasses Nadal: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ స్టార్ ప్లేయర్.. ఈ విషయంలో నాదల్, ఫెదరర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను కూడా అధిగమించాడు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AFP)

Hardik Surpasses Nadal: భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుత ఆధునిక క్రికెట్‌లో అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకడు. పరిమిత ఓవర్లలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా బాధ్యత నిర్వహిస్తున్న పాండ్య తన దైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు టీమిండియాకు నేతృత్వం వహించి అద్భుత విజయాన్ని అందించాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ ప్లేయర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పాండ్య 25 మిలియన్ల(రెండున్నర కోట్లు) ఫాలోవర్లతో అరుదైన ఘనత సాధించాడు. దీంతో ప్రపంచంలోనే చాలా మంది సెలబ్రెటీలను అతడు అధిగమించాడు. ముఖ్యంగా గ్లోబల్ సూపర్ స్టార్లయిన నాదల్, రోజర్ ఫెదరర్, మ్యాక్స్ వెర్స్‌టాపెన్, ఎర్లింగ్ హాలండ్ లాంటి దిగ్గజాలను సైతం అధిగమించి సోషల్ మీడియా సెన్సేషన్‌గా అవతరించాడు హార్దిక్. ఈ అరుదైన ఘనత సాధించడంతో హార్దిక్ తన అభిమానులకు, ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.

"నాపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క అభిమానికి నాకు ప్రత్యేకమే. అందుకే ఇన్నేళ్లుగా నాపై ప్రేమను కురిపిస్తూ మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను." అని హార్దిక్ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేకమైన పోస్టును పెట్టాడు.

హార్దిక్ పాండ్య ఇన్‌స్టాలోనే కాకుండా ట్విటర్‌లో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో అతడికి 8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 29 ఏళ్ల హార్దిక్ ఇటీవలే తన భార్య నటాషాను మరోసారి క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. ఉదయ్‌పుర్ వేదికగా వీరి పెళ్లి జరిగింది. 2020 జనవరి 1న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోగా.. కోవిడ్ లాక్డౌన్ లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా రెండేళ్ల బాబు ఉన్నాడు. అతడి పేరు అగస్త్య.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య ఆ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌కు తిరిగి టీమిండియాలోకి రానున్నాడు. మార్చి 17న జరగనున్న తొలి వన్డేకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ కారణాలతో దూరం కానున్నాడు. పాండ్య ఇప్పడివరకు 11 టెస్టులు, 71 వన్డేలు, 87 టీ20ల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఆస్ట్రేలియా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం