Shubman Gill Dating Sara: గిల్‌ను టీజ్ చేసిన ఫ్యాన్స్.. 'సారా వదిన' అంటూ నినాదాలు.. కోహ్లీ షాకింగ్ రియాక్షన్-fans teases shubman gill with sara ali khan chants during new zealand match
Telugu News  /  Sports  /  Fans Teases Shubman Gill With Sara Ali Khan Chants During New Zealand Match
సారా అలీ ఖాన్-శుబ్‌మన్ గిల్
సారా అలీ ఖాన్-శుబ్‌మన్ గిల్

Shubman Gill Dating Sara: గిల్‌ను టీజ్ చేసిన ఫ్యాన్స్.. 'సారా వదిన' అంటూ నినాదాలు.. కోహ్లీ షాకింగ్ రియాక్షన్

26 January 2023, 17:29 ISTMaragani Govardhan
26 January 2023, 17:29 IST

Shubman Gill Dating Sara: ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అభిమానులు శుబ్‌మన్ గిల్‌ను టీజ్ చేశారు. సారా అలీ ఖాన్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shubman Gill Dating Sara: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ఆటతో పాటు తన రిలేషన్‌షిప్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతేడాది వరకు సచిన్ తెందూల్కర్ తనయ సారా తెందూల్కర్‌తో గిల్ డేట్ చేశాడని వదంతులు వచ్చాయి. ఇటీవల కాలంలో సైఫ్ అలీ ఖాన్ కుమార్తే, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి లంచ్, డిన్నర్లకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసింది. తాజాగా మరోసారి శుబ్‍‌మన్ గిల్‌కు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మైదానంలో అబిమానులు గిల్‌ను టీజ్ చేశారు. సారా పేరును నినదిస్తూ సందడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే ఇటీవలే న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత ఆటగాడు శుబ్‌మన్ గిల్ శతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్‌ను ఉద్దేశిస్తూ స్టేడియంలో ఫ్యాన్స్ టీజ్ చేశారు. "హమారీ బాబీ కైసీ హో? సారా బాబీ జైసీ హో(మా వదిన ఎలా ఉంది? సారా వదిన వలే ఉంది)".. అని గట్టిగా అరిచారు. అయితే వారు సారా అలీ ఖాన్ లేదా సారా తెందూల్కర్ పేరును పిలిచారా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ వీరిద్దరితోనూ డేటింగ్ చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. అయితే ఈ వీడియోలో మరో ఆకర్షించే విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్ గిల్‌ను ఉద్దేశిస్తూ సారా పేరును టీజ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఫన్నీగా స్పందించాడు. ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదే సమయంలో గిల్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్‌గా చూస్తుండిపోయాడు.

అభిమానులు ఈ విధంగా గిల్ ఆడుతున్నప్పుడు సారా పేరును ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రెండు, మూడు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో స్టేడియంలో కొంతమంది సారా సారా అంటూ గిల్‌ను ఉద్దేశిస్తూ నినాదాలు చేశారు.

సారా అలీ ఖాన్‌తో శుబ్‌మన్ గిల్ డేటింగ్‌లో ఉన్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఆ మధ్య కాలంలో దిల్ దియాన్ గలాన్ షోలో గిల్.. సారా గురించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైంది. సారాతో డేటింగ్‌లో ఉన్నావా? అంటూ ఈ షోలో అతడిని ప్రశ్నించగా.. అయి ఉండొ్చ్చు (May be) అనే సమాధానమిచ్చాడు. మొత్తం నిజం చేప్పేయండి అని మరోసారి ప్రశ్నించగా.. మొత్తం నిజమే చెప్పాను అంటూ గిల్ మేబీ లేదా మేబీ నాట్ అంటూ తప్పించుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత కథనం