Eng W vs Ind W: ఝులన్‌కు అదిరిపోయే ఫేర్‌వెల్‌.. ఇంగ్లండ్‌పై ఇండియా క్లీన్‌స్వీప్-eng w vs ind w as jhulan gets farewell with series clean sweep over england ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Eng W Vs Ind W: ఝులన్‌కు అదిరిపోయే ఫేర్‌వెల్‌.. ఇంగ్లండ్‌పై ఇండియా క్లీన్‌స్వీప్

Eng W vs Ind W: ఝులన్‌కు అదిరిపోయే ఫేర్‌వెల్‌.. ఇంగ్లండ్‌పై ఇండియా క్లీన్‌స్వీప్

Hari Prasad S HT Telugu
Sep 24, 2022 10:45 PM IST

Eng W vs Ind W: ఝులన్‌ గోస్వామికి అదిరిపోయే ఫేర్‌వెల్‌ ఇచ్చింది ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఇంగ్లండ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ తో ఝులన్ గోస్వామికి మంచి ఫేర్ వెల్ ఇచ్చిన ఇండియన్ టీమ్
ఇంగ్లండ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ తో ఝులన్ గోస్వామికి మంచి ఫేర్ వెల్ ఇచ్చిన ఇండియన్ టీమ్ (Action Images via Reuters)

Eng W vs Ind W: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ పేస్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామికి ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో గ్రాండ్‌ ఫేర్‌వెల్‌ దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో 16 రన్స్‌తో గెలిచిన ఇండియన్‌ టీమ్‌ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో ఝులన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది.

ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత సహచర ప్లేయర్స్‌ ఝులన్‌ను భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్‌ బయటకు తీసుకురావడం విశేషం. తన చివరి మ్యాచ్‌లో ఝులన్‌ రెండు వికెట్లు తీసింది. ఈ లోస్కోరింగ్‌ థ్రిల్లర్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. 170 రన్స్‌ టార్గెట్‌ చేజింగ్‌లో ఇంగ్లండ్‌ చివరికి 43.3 ఓవర్లలో 153 రన్స్‌కు ఆలౌటైంది. చేజింగ్‌లో 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు విజయంపై ఆశలు రేపిన ఛార్లీ డీన్‌ (47) చివరికి మన్కడింగ్‌ ద్వారా రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఆమె చివరి వికెట్‌కు డేవీస్‌తో కలిసి 35 పరుగులు జోడించింది. ఇంగ్లండ్‌ మెల్లగా విజయం వైపు వెళ్తున్నట్లు కనిపించింది. అయితే 44వ ఓవర్‌ వేసిన దీప్తి శర్మ.. నాలుగో బంతి వేయబోయే సమయంలో డీన్‌ ముందుగానే క్రీజు వదిలింది. దీంతో ఆమెను దీప్తి రనౌట్‌ చేసింది.

ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఇండియన్‌ టీమ్.. ఈ విజయంతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇండియా తరఫున 204 వన్డేలు ఆడిన ఝులన్‌ గోస్వామికి అదిరిపోయే ఫేర్‌వెల్‌ ఇచ్చింది. ఇండియన్‌ బౌలర్లలో రేణుకా సింగ్‌ 4, ఝులన్‌, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 170 రన్స్‌ టార్గెట్‌ చేజింగ్‌లో ఇంగ్లండ్‌ 65 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయినా.. డీన్‌ (47), క్రాస్‌ (10), డేవీస్‌ (10 నాటౌట్‌) పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా 45.4 ఓవర్లలో 169 రన్స్‌కే ఆలౌటైంది. దీప్తి శర్మ 68 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్‌ స్మృతి మంధానా 50, పూజా వస్త్రకర్‌ 22 రన్స్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో చివరిసారి బ్యాటింగ్‌ చేయడానికి వచ్చిన ఝులన్‌కు ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇవ్వడం విశేషం. ఆమె బ్యాటింగ్‌కు దిగుతుండగా.. ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ రెండు వైపులా నిలబడి చప్పట్లతో స్వాగతించారు. అయితే తన చివరి మ్యాచ్‌లో ఝులన్‌ తొలి బంతికే డకౌటైంది.

WhatsApp channel