ENG vs BAN Odi Series: ఏడేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్
ENG vs BAN Odi Series: శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 132 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది.
ENG vs BAN Odi Series: ఏడేళ్ల తర్వాత స్వదేశంలో తొలిసారి బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. హోమ్ కంట్రీలో వరుసగా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లను నెగ్గి జోరుమీదున్న బంగ్లాదేశ్‌కు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 132 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఇంగ్లాండ్ చిత్తు చేసింది. తొలి వన్డేలో పాటు రెండో వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నది.
రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (132 రన్స్) సెంచరీతో చెలరేగాడు. అతడి బ్యాటింగ్ మెరుపులతో ఇంగ్లాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 326 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 194 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షకీబ్ అల్ హసన్ (58 రన్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. 2016 అక్టోబర్ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్ కోల్పోయిన తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం.
2014 నవంబర్ తర్వాత స్వదేశంలో జరిగిన 15 వన్డే సిరీస్‌లలో కేవలం రెండింటిని మాత్రమే బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఆ రెండు సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలోనే బంగ్లాదేశ్ పరాజయాల్ని చవిచూడటం గమనార్హం.