Suresh Raina | రైనాను ఎందుకు తీసుకోలేదో చెప్పిన సీఎస్కే సీఈవో-csk ceo kasi viswanath talks about why they did not opt for suresh raina ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suresh Raina | రైనాను ఎందుకు తీసుకోలేదో చెప్పిన సీఎస్కే సీఈవో

Suresh Raina | రైనాను ఎందుకు తీసుకోలేదో చెప్పిన సీఎస్కే సీఈవో

Hari Prasad S HT Telugu
Feb 15, 2022 06:23 AM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసింది రైనానే. అందరి కంటే నిలకడగా కూడా ఆడింది అతడే. అలాంటి రైనాను వేలంలో సీఎస్కే లైట్‌ తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. అతనికి వెన్నుపోటు పొడిచారంటూ కూడా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ గరంగరమయ్యారు.

<p>సురేశ్ రైనా</p>
సురేశ్ రైనా (Twitter)

చెన్నై: రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో ఎన్నో సంచలనాలు ఉన్నట్లే.. కొందరు కచ్చితంగా అమ్ముడవుతారనుకున్న ప్లేయర్స్‌ను ఫ్రాంఛైజీలు పట్టించుకోకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరికన్నా ఎక్కువగా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగాంచిన రైనాను తీసుకోకపోవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. 

11 ఏళ్లపాటు నిలకడగా టీమ్‌కు సేవలందించిన ప్లేయర్‌ను సీఎస్కే కూడా పట్టించుకోలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అభిమానులైతే సోమవారం అంతా మీమ్స్‌తో సోషల్ మీడియాలో రైనాను ట్రెండింగ్‌లో ఉంచారు. అయితే దీనిపై మొత్తానికి సీఎస్కే టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌ స్పందించారు. ప్లేయర్‌ ఫామ్‌, టీమ్ కూర్పు వంటివాటి గురించే తాము ముందుగా ఆలోచిస్తామని ఆయన చెప్పారు. 

"సీఎస్కేకు గత 12 ఏళ్లుగా ఎంతో నిలకడగా ఆడుతున్న ప్లేయర్‌ రైనా. రైనాను తీసుకోకపోవడం మాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. అయితే ప్లేయర్‌ ఫామ్, ఎలాంటి టీమ్‌ కావాలనుకుంటున్నామన్న దాన్ని బట్టే టీమ్‌ కూర్పు ఉంటుంది. ఈ టీమ్‌ను తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం" అని విశ్వనాథ్‌ అన్నారు. సీఎస్కే తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాఫ్‌ డుప్లెస్సిని తీసుకోకపోవడంపైనా ఆయన స్పందించారు. వేలం అంటే ఇలాగే ఉంటుంది మరి అని విశ్వనాథ్‌ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం