CWG 2022 Closing Ceremony: బర్మింగ్హామ్ కాంతులతో కళ కళలాడింది.. ముగింపు అదిరింది-commonwealth games 2022 closing ceremony in a celebration of culture and pride of birmingham ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022 Closing Ceremony: బర్మింగ్హామ్ కాంతులతో కళ కళలాడింది.. ముగింపు అదిరింది

CWG 2022 Closing Ceremony: బర్మింగ్హామ్ కాంతులతో కళ కళలాడింది.. ముగింపు అదిరింది

Maragani Govardhan HT Telugu
Aug 09, 2022 08:10 AM IST

బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ సోమవారంతో ముగిశాయి. ఈ క్రీడల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొత్తం 877 పతకాలను అథ్లెట్లు అందుకున్నారు.

<p>కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపు వేడుకలు&nbsp;</p>
కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపు వేడుకలు (REUTERS)

ఒలింపిక్ గేమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన పోటీలు ఎవైనా ఉన్నాయంటే అవి కామన్వెల్త్ గేమ్సే అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాలు పోటీ పడే ఈ క్రీడల్లో పతకం కోసం ఆటగాళ్లు తీవ్రంగా కృషి చేస్తారు. అలాగే బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ సోమవారం నాడు ముగింపు పలికాయి. 11 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో అథ్లెట్లు, క్రీడాకారులు తమ సత్తాను చాటి పతకాల ఒడిసి పట్టుకున్నారు. ఈ పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 61 మెడల్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. సోమవారంతో ఈ పోటీలు ముగియడంతో బర్మింగ్హామ్ అలెగ్జాండర్ స్టేడియం వేదికగా ముగింపు ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి.

ఈ వేడుకలు బర్మింగ్హామ్ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో ఘనంగా జరిగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులతో బర్మింగ్హామ్ వీదులు వెలిగిపోయాయి. వేల మంది ఒకే సారి వీక్షిస్తున్న ఈ వేడుకలు గుర్తుండిపోయేలా నిర్వహించారు. అయితే ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిథులెవ్వరూ లేరు. పాపులర్ మ్యూజికల్ నంబర్స్, పర్ఫార్మెన్స్‌తో కామన్వెల్త్ చివరి రోజు రాత్రి మర్చిపోలేని రీతిలో జరిగింది.

ఈ పోటీల్లో ప్రదర్శనతో ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఈ నగర ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. LGBTQ+ వ్యక్తులకు అండగా ఉండేలా నిలిచేందుకు ప్రకటన చేయాలని ముగింపు వేడుకలకు ప్రధాన సందేశమిచ్చారు. ఈ గేమ్స్‌కు అద్భుతంగా సాగాయి. ప్రేక్షకులు వేదికలతో కిక్కిరిసిపోవడంతో 1.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వెస్ట్ మిడ్ లాండ్స్ అంతటా ఈ పోటీలు సంచలనం సృష్టించాయి. భవిష్యత్తులో ఒలింపిక్స్ బిడ్‌కు దారితీయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ముగింపు వేడుకల సందర్భంగా అలెగ్జాండర్ స్టేడియంలో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ లూయిస్ మాట్లాడుతూ.. ఈ గేమ్స్ చాలా బోల్డ్‌గా, సందడితో పాటు అద్భుతంగా జరిగాయని స్పష్టం చేశారు. "11 రోజుల క్రితం అథ్లెట్లందరూ ఈ మూమెంట్‌ను ఉపయోగించాలని నేను అడిగాను. 877 పతకాలు అందుకున్నాడు. 97 కామన్వెల్త్ రికార్డులు, నాలుగు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. మేము ఈ గేమ్స్‌కు ముగింపునకు తీసుకొస్తున్నామని మీరనుకోవచ్చు.. కానీ ఇది ముగింపు కాదని దయ చేసి గుర్తుంచుకోండి" అని ఆయన అన్నారు.

ఈ గేమ్స్‌లో పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా మెడల్ ఈవెంట్లు జరగడం మల్టిపుల్ స్పోర్ట్స్ ఈవెంట్ బహుశా ఇదే ప్రథమం కావచ్చు. ముగింపు వేడుకలు, సంగీతం, ఆనందోత్సహాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి. కామన్వెల్త్ టార్చ్‌ను 2026లో జరగనున్న ఆస్ట్రేలియా విక్టోరియా వేదికకు తరలించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం