BCCI: మాజీ క్రికెటర్లకు పెన్షన్స్‌ను పెంచిన బీసీసీఐ...
మాజీ క్రికెటర్ల, అంపైర్స్ కు అందించే పెన్షన్స్ ను పెంచుతున్నట్లుగా బీసీసీఐ సోమవారం ప్రకటించింది. పెన్షన్స్ పెంపు వల్ల తొమ్మిది వందల మంది క్రికెటర్లకు లాభం చేకూరనున్నది బీసీసీఐ సెక్రటరీ జయ్ షా పేర్కొన్నారు.
మాజీ క్రికెటర్లు, అంపైర్ల కు బీసీసీఐ ఆర్ధికంగా అండగా నిలవబోతున్నది. వారికి ఇచ్చే పెన్షన్స్‌ను పెంచుకున్నట్లుగా బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేసింది. ఈ పెంపు పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు, మాజీ అంపైర్లకు వర్తిస్తుందని ఈ ప్రకటనలో బీసీసీఐ పేర్కొన్నది. కనిష్టంగా 15000 ఉన్న పెన్షన్ ను 30 వేల రూపాయలకు పెంచింది. గరిష్టంగా 50 వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను 70 వేలకు పెంచారు.. మొత్తం ఐదు కేటగిరీలుగా ఈ పెన్షన్‌ను అందించబోతున్నట్లు బీసీసీఐ పేర్కొన్నది. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమలులోకి వస్తుందని ఈ ప్రకటనలో తెలిపారు. క్రికెటర్లకు ఆర్థికంగా అండగా నిలవడం బీసీసీఐ ప్రధాన బాధ్యత అని ప్రెసిడెంట్ సౌరభ్ గంగూళీ పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెటర్ల జీవితానికి భరోసా నివ్వటం చాలా ముఖ్యమని అన్నాడు. అన్ సంగ్ హీరోస్ గా క్రికెట్ ఆటలో అంపైర్స్ చేసిన సహకారం మర్చిపోలేనిదని, వారి సేవలను బీసీసీఐ ఎప్పుడూ గౌరవిస్తుందని గంగూలీ అన్నారు. ప్రస్తుతం క్రికెటర్లో పాటు మాజీ క్రికెటర్ల సంక్షేమమే బీసీసీఐ ప్రధాన లక్ష్యమని సెక్రటరీ జయ్ షా పేర్కొన్నారు. పెన్షన్ పెంపు వల్ల దాదాపు తొమ్మిది వందల మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లకు ఆర్థికంగా లబ్ది చేకూరనున్నదని జయ్ షా తెలిపాడు.
సంబంధిత కథనం
టాపిక్