Team India: వెస్టిండీస్‍తో టెస్టులు, వన్డేలకు భారత జట్ల ఎంపిక.. పుజారాకు దక్కని చోటు.. రహానేకు మళ్లీ ఆ పోస్ట్-bcci announces indian teams for odis test in west indies tour pujara dropped rohit to lead ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India: వెస్టిండీస్‍తో టెస్టులు, వన్డేలకు భారత జట్ల ఎంపిక.. పుజారాకు దక్కని చోటు.. రహానేకు మళ్లీ ఆ పోస్ట్

Team India: వెస్టిండీస్‍తో టెస్టులు, వన్డేలకు భారత జట్ల ఎంపిక.. పుజారాకు దక్కని చోటు.. రహానేకు మళ్లీ ఆ పోస్ట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 23, 2023 04:12 PM IST

Team India: వెస్టిండీస్‍తో వచ్చే నెల మొదలుకానున్న టెస్టులు, వన్డే సిరీస్‍లకు భారత జట్లను ప్రకటించింది బీసీసీఐ. టెస్టు టీమ్‍లో పుజారకు చోటు దక్కలేదు.

భారత జట్టు
భారత జట్టు

Team India: వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‍లకు భారత జట్లను నేడు (జూన్ 23) ప్రకటించింది బీసీసీఐ. జూలై 12న వెస్టిండీస్‍తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. జూలై 27న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు సిరీస్‍లకు రోహిత్ శర్మ కెప్టెన్‍గా ఉన్నాడు. భారత నయా వాల్ చతేశ్వర్ పుజారాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవలే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానే టెస్టుల్లో మళ్లీ వైస్ కెప్టెన్ పోస్టును సొంతం చేసుకున్నాడు. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌కు రెండు జట్లలో చోటు దక్కింది. వన్డే టీమ్‍లోకి సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ కు టెస్టు జట్టులో చోటు దక్కింది. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు. అతడి స్థానంలో పేసర్ నవ్ దీప్ సైనీకి టెస్టుల్లో చోటు దక్కింది. మరో పేసర్ జయదేవ్ ఉనాద్కత్ కూడా మళ్లీ వచ్చేశాడు. జట్ల వివరాలు ఇవే.

వెస్టిండీస్‍ టూర్‌లో టెస్టు సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్‍దేవ్ ఉనాద్కత్, నవ్‍దీప్ సైనీ

వన్డే సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, జయ్‍దేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్

జూలైలో మొదలయ్యే వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. జూలై 12న డొమెనికా వేదికగా విండీస్‍తో తొలి టెస్టు ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్‍తోనే 2023-25 ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ సైకిల్‍ను మొదలుపెట్టనుంది. ఇక జూలై 20 నుంచి రెండో టెస్టు జరుగుతుంది. జూలై 27, జూలై 29, ఆగస్టు 1 తేదీల్లో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డేలు జరగనున్నాయి. ఆగస్టు 3వ తేదీన మొదలుకానున్న ఐదు టీ20 సిరీస్‍ ఆగస్టు 13న ముగుస్తుంది. ప్రస్తుతం టెస్టులు, వన్డేలకు భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సిరీస్‍కు టీమ్‍ను త్వరలోనే ఎంపిక చేయనుంది.

Whats_app_banner