Kanya Rasi Weekly Horoscope 29th September to 5th October: ప్రేమ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి, పరిస్థితి మరింత దిగజారక ముందు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆఫీసులో కొత్త పనులకు బాధ్యత వహిస్తారు. ఇది కెరీర్ పురోగతికి తోడ్పడుతుంది. ఈ వారం ఆర్థిక సమస్యలు ఉండవు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. తల్లిదండ్రుల సహకారంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారం ద్వితీయార్ధంలో మీరు మీ ప్రేమికుడికి ఆత్మవిశ్వాసంతో ప్రపోజ్ చేయవచ్చు.
ఈ వారం దీర్ఘకాలిక సంబంధాలలో ఉన్నవారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పెళ్లయిన వారు ఆఫీసు రొమాన్స్‌కు దూరంగా ఉండాలి. కొంతమంది మహిళలు జీవిత భాగస్వామి కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది.
ఆఫీసు పనుల్లో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. దీనికి కొంచెం శ్రద్ధ అవసరం. కొంతమంది ప్రొఫెషనల్స్ గడువులోగా పనిచేయడం కష్టమవుతుంది. కానీ పనితీరు మెరుగ్గా లేకపోవడానికి ఇది కారణం కాకూడదు.
కళాకారులు, చిత్రకారులు, సంగీతకారులకు ఈ వారం అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వారంలో చివరి 3-4 రోజులు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కావడం మంచిది. ఆఫీసులోని క్లయింట్లు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఆకట్టుకుంటారు. కొత్త భాగస్వామ్యం కోసం సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.
ఆర్థిక విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వారం తోబుట్టువులతో డబ్బుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులు విదేశాలలో వ్యాపార విస్తరణకు నిధులు పొందవచ్చు.
ఈ వారం మీరు ఇంటి మరమ్మతులు పూర్తి చేస్తారు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. పిల్లలకు డబ్బు పంపిణీ చేయడం గురించి పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తారు.
ఈ వారం మీకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. స్త్రీలకు స్త్రీ జననేంద్రియ వ్యాధులతో సమస్యలు ఉండవచ్చు. ఈ వారం స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా గొంతు నొప్పి సమస్య కూడా ఉండవచ్చు. కన్య రాశి గర్భిణీ స్త్రీలు ద్విచక్ర వాహనంలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు, కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.