Lucky Zodiacs : సింహరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు.. ఆ రాశుల వారికి అదృష్టమే..-venus transits in leo good luck for these zodiac signs know in detail ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Venus Transits In Leo Good Luck For These Zodiac Signs Know In Detail

Lucky Zodiacs : సింహరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు.. ఆ రాశుల వారికి అదృష్టమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 01, 2022 09:54 AM IST

Lucky Zodiacs till 17th September : శుక్రుడు ఇప్పటికే సింహరాశిలోకి ప్రవేశించాడు. ఈరోజు నుంచి శుక్రుడు, సూర్యుడు కలయిక ఫలితంగా.. కొన్నిరాశులవారికి ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు జ్యోతిష్యులు. వారికి సెప్టెంబర్ 17వరకు లక్ కలిసి వస్తుంది అంటున్నారు. మరి అవి ఏ రాశులు.. మీ రాశి దానిలో ఉందో లేదో ఇప్పుడు తెలుసకుందాం.

పలు రాశులకు అదృష్టం
పలు రాశులకు అదృష్టం

Lucky Zodiacs till 17th September : శుక్రుడి అనుగ్రహంతో సెప్టెంబర్ 17 వరకు కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. ప్రస్తుతం సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశించగా.. ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజు నుంచి శుక్రుడు, సూర్యుడు సింహరాశిలోనే కలిసి ఉంటారు. దీని ఫలితంగా పలు రాశుల వారు ప్రయోజనం పొందుతారు. సెప్టెంబర్ 17 వరకు లక్ కొనసాగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

శుక్రుడు, సూర్యుడు కలయికతో.. ముఖ్యంగా మూడు రాశులవారికి ధన లాభం, సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుందని.. అది సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుందని అంటున్నారు.

వృషభం

శుక్రుడు, సూర్యుడు కలయిక వృషభ రాశి వారికి లాభిస్తుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందుతారు. ఇప్పటికే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ ఉంటుంది.

సింహరాశి

సూర్యుడు, శుక్రుడు ప్రస్తుతం సింహరాశిలోనే సంచరిస్తున్నారు. ఫలితంగా సింహరాశివారు కచ్చితంగా లాభపడతారు. వారికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

తులారాశి

తులా రాశి వారికి సూర్యుడు, శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదించే మార్గం విశాలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే.. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఇది మీ డబ్బు లాభాలను జోడించే సమయం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్