Vastu Tips | ఇంట్లో 7 గుర్రాల ఫోటో పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే, ఈ ఫలితాలుంటాయి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏడు గుర్రాల ఫోటోను పెట్టుకుంటే శుభఫలితాలు కలుగాయి. ఏడు అనేది ఒక అదృష్ట సంఖ్యగా చెప్తారు. ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకోవటమే కాదు, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం వాటిని ఉంచాల్సిన చోట ఉంచాలి. అలాగే కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన అలంకరణ మాత్రమే కాకుండా ఆ ఇంటికి వాస్తు బలం కూడా పెరుగుతుంది. అలాంటి జాబితాలో ఏడు గుర్రాల చిత్ర పటం కూడా ఒకటి. ఇంట్లో ఏడు గుర్రాల చిత్రం పెట్టుకోవటం వాస్తుపరంగా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పరుగెత్తే ఏడు గుర్రాల ఫోటో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుందని అంటారు.
హిందూ ధర్మాల ప్రకారం ఏడు అంకె శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ అంకె ప్రతి ఒక్కరి జీవితంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంది. పెళ్లి సమయంలో ఏడడుగులు వేస్తారు. ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులో ఏడు రంగులున్నాయి. నేలపై ఏడు మహాసముద్రాలు ఉన్నాయి. విశ్వంలో ఏడు నక్షత్రాల రాశులున్నాయి. అలాగే, సూర్య భగవానుడి రథంలోనూ ఏడు గుర్రాలు ఉన్నాయి. అందుకే ఏడు గుర్రాలు ఉన్న ఫోటోను ఇంటి గోడపై ఉంచుకుంటే పవిత్రంగా భావిస్తారు.
ఏ దిశలో ఉంచాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇంట్లో దక్షిణ గోడపై ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. గుర్రాలు వేర్వేరు దిశల్లో వెళుతున్నట్లు ఉండకూడదు అన్ని గుర్రాలు ఒకే దిశలో వెళుతున్నట్లు చూసుకోవాలి. అలాగే వాటి ముఖం ఇంటి బయటి వైపు, గుమ్మం వైపు ఉండకూడదు. ఇంటి లోపలివైపే ఉండాలి. చిత్రంలో ఉన్న గుర్రాలు కోపంతో కాకుండా సంతోషకరమైన రూపంలో ఉండాలి. ఏడు తెల్లటి గుర్రాల చిత్రాన్ని ఉంచటం అత్యంత మంచిది. అలాగే ఈ ఫోటో లేదా చిత్రపటం లివింగ్ రూంలో ఉంచాలి. పడక గదిలో ఎంతమాత్రం ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఏడు గుర్రాల బొమ్మను ఉంచితే బంధాలలో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాస్తు ప్రకారం, ఏడు గుర్రాల బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, సామరస్యం ఉంటుంది. అప్పుల సమస్య ఉన్నట్లయితే తీరిపోతుంది. ఇంటికి వాయువ్య దిశలో ఒక జత గుర్రాల విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్