Venus Transit: శుక్ర గ్రహ సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం
శుక్ర సంచారం మే 30న జరగబోతోంది. శుక్రుడి రాశి మార్పు వల్ల ఏయే రాశుల జాతకులకు ఎలాంటి ప్రభావం ఉండబోతోందో తెలుసుకోండి.
శుక్రుడు మే 30న కర్కాటక రాశిలోకి సంచరించనున్నాడు. శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడాన్నే శుక్ర గ్రహ సంచారం అంటారు. కర్కాటక రాశిలోకి శుక్రుడి సంచారం కొన్ని రాశులకు ధన, సౌఖ్య లాభాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతుంది. శుక్రుడు కొన్ని రాశులకు ఆర్థిక సమృద్ధి అందిస్తాడు. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి వీరికి సంపద, సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఆయా రాశుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మిథున రాశి వారిపై శుక్ర సంచార ప్రభావం
మిథున రాశి వారికి శుక్రుడు 3వ, 5వ ఇంటికి అధిపతి అవుతాడు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు మంచి స్థితిలో ఉంటే ఈ సంచార సమయంలో మీరు డబ్బు సంపాదిస్తారు. కుటుంబ వ్యాపారం లేదా వ్యాపార భాగస్వామ్యంతో సంబంధం కలిగి ఉంటే ఈ సమయంలో మీరు అపారమైన డబ్బు సంపాదిస్తారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే మిథున రాశి వారికి భారీ లాభాలు లభిస్తాయి.
కర్కాటక రాశి జాతకులపై శుక్ర సంచార ప్రభావం
కర్కాటక రాశి వారు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయతో వ్యవహరించడం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారు. శుక్ర సంచారం సమయంలో మీరు పెద్దమొత్తంలో డబ్బు పొందవచ్చు. అనుకోని వనరుల నుంచి కూడా ధనం అందుతుంది. కార్యాలయంలోని మీ సీనియర్లతో సంబంధాలు మెరుగుపడుతాయి. మీరు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు. ఈ శుక్ర సంచారం మీ వ్యాపారం లేదా ఏదైనా వృత్తిలో గణనీయమైన వృద్ధిని తెస్తుంది.
కన్యా రాశి జాతకులపై శుక్ర సంచార ఫలితం
కన్యా రాశి వారికి శుక్రుడు రెండో, తొమ్మిదో ఇంటికి అధిపతి అవుతాడు. 11వ ఇంటిలో సంచరిస్తాడు. ఇది కన్యా రాశి వారికి ఒక రకమైన సంపద యోగాన్ని సృష్టిస్తుంది. ఇది ఆర్థికంగా చాలా ప్రయోజనకరమైన సమయం. లక్ష్మీ కటాక్షం వల్ల మీ వ్యాపారాల్లో లభాలు రెట్టింపవుతాయి. ప్రయివేటు రంగానికి చెందిన వారికి వేతన పెంపు, బోనస్‌లు, పదోన్నతులు కూడా లభిస్తాయి. కార్యాలయంలో మీ హోదా, గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి.