సూర్య, బుధ, శుక్రుల సంచారం.. రాబోయే 20 రోజుల్లో జాతకాల్లో మార్పులు-sun mercury venus transits soon know which moon sign get benefitted ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సూర్య, బుధ, శుక్రుల సంచారం.. రాబోయే 20 రోజుల్లో జాతకాల్లో మార్పులు

సూర్య, బుధ, శుక్రుల సంచారం.. రాబోయే 20 రోజుల్లో జాతకాల్లో మార్పులు

HT Telugu Desk HT Telugu
May 19, 2023 02:48 PM IST

గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జాతకాల్లో మార్పులు తెస్తాయి. రానున్న 20 రోజుల్లో పలు గ్రహాల సంచారం కారణంగా జాతకాల్లో మార్పులు కనిపించబోతున్నాయి.

రవి, బుధ, శుక్ర గ్రహాల సంచారం కారణంగా 12 రాశులపై ప్రభావం తెలుసుకోండి
రవి, బుధ, శుక్ర గ్రహాల సంచారం కారణంగా 12 రాశులపై ప్రభావం తెలుసుకోండి (freepik)

గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ గ్రహ సంచారం అన్ని రాశులపై శుభాశుభ ప్రభావాన్ని చూపుతుంది. రానున్న రోజుల్లో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల సంచారం వల్ల పలు రాశులపై ప్రభావం పడుతుంది.

మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 15న బుధుడు మేష రాశిలోకి సంచరిస్తున్నాడు. ఆ తరువాత మే 30న శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆయా గ్రహాల సంచారంతో ఏయే రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇక్కడ చదవండి.

మేష రాశి వారికి..

తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనసు కలత చెందవచ్చు. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు పాత స్నేహితుడిని మళ్లీ సంప్రదించవచ్చు. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. స్థాన మార్పు కూడా ఉండవచ్చు.

వృషభ రాశి వారికి..

వృషభ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అయితే కోపాన్ని వీడాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యా సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. అకడమిక్, మేథోపరమైన పనుల్లో గౌరవం లభిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. సంభాషణలో సమతుల్యత పాటించండి. మిత్రుల నుంచి, సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాహన ఆనందం పెరుగుతుంది.

మిథున రాశి వారికి ఫలాలు

ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అయినా మనసు అశాంతిగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. స్థాన మార్పునకు ఆస్కారం ఉంది. విద్యా సంబంధిత విషయాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవన పరిస్థితులు కూడా మెరుగుపడుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త. ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదాలు ఉండవచ్చు.

కర్కాటక రాశి వారికి ఫలాలు

మనసు అశాంతిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. కష్టపడ్డా లాభాలు తగ్గుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. తోబుట్టువులతో విభేదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఆశించిన విజయం దక్కుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మీరు దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది.

సింహ రాశి వారికి ఫలాలు

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. శాంతంగా ఉండాలి. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. ప్రణాళిక లేని ఖర్చులు మితిమీరిపోతాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్యా రాశి వారి ఫలాలు

కన్యా రాశి వారికి ఆత్మ విశ్వాసం నిండుగా ఉంటుంది. ఆదాయం తగ్గి ఖర్చులు అధికమవుతాయి. మేథోపరమైన పనుల ద్వారా ధనాన్ని పొందవచ్చు. ఉద్యోగ రంగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. ఖర్చులు పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి.

తులా రాశి వారికి ఫలాలు

తులా రాశి వారి మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో ఇభ్బందులు ఎదురవుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మేథోపరమైన పనుల వల్ల గౌరవం పొందుతారు. వస్త్రాల కొనుగోలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్ధతు లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

వృశ్ఛిక రాశి వారికి ఫలాలు

విద్యార్థులు విజయం సాధిస్తారు. మేథోపరమైన కృషికి గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంతోష సమయాన్ని గడుపుతారు. సౌమ్యంగా మాట్లాడుతారు. గృహంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. బట్టలు కొనుగోలు ేస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు రాశి వారికి ఫలాలు

మనస్సు కలత చెందుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. కఠోరంగా శ్రమించాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. మీరు కుటుంబానికి దూరంగా ఉండాలనుకోవచ్చు. జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి. స్థాన మార్పునకు ఆస్కారం ఉంది. విద్యార్థులు రాణిస్తారు. రిలేషన్‌షిప్స్‌లో మాధ్యుర్యం ఉంటుంది.

మకర రాశి వారికి ఫలాలు

మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులు వేధిస్తాయి. స్నేహితుడి నుంచి సహాయ సహకరాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశం ఉంది. ఉన్నత పదవి రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి వారికి ఫలాలు

భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. తండ్రి నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆస్తి నుంచి ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయంతో పురోభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. పని పరిధి పెరుగుతుంది. కఠోరంగా శ్రమించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి.

మీన రాశి వారికి రాశి ఫలాలు

పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. బట్టలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గృహంలో ఆనందం పెరుగుతుంది. సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఓపికతో ఉండాలి. మితిమీరిన కోపం తగదు. వ్యామోహానికి దూరంగా ఉండాలి. స్నేహితుడి సాయంతో ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

Whats_app_banner