సెప్టెంబర్ 2, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో గుర్తింపు, ఖర్చులు పెరుగుతాయి-today september 2nd rasi phalalu in telugu check all zodiac signs horoscope prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 2, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో గుర్తింపు, ఖర్చులు పెరుగుతాయి

సెప్టెంబర్ 2, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో గుర్తింపు, ఖర్చులు పెరుగుతాయి

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.09.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 2 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 2 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.09.2024

వారం: సోమ‌వారం, తిథి: అమావాస్య‌,

నక్షత్రం: మ‌ఖ‌, మాసం: శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష

నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకస్మిక చిన్నపాటి ప్రయాణాలు ఉండొచ్చు. దానివ‌ల్ల‌ కొంత అలసట. సంఘసేవ చేస్తారు, కొంత మానసిక సంతృప్తి ఉంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం అవార్డులు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నిరాశ భావనల్ని, అసంతృప్తిని అధిగమించాలి. సంతానము ఉన్నత విద్యా విషయంలో విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. రుణాలు చెల్లిస్తారు. నూతన విద్యా విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల సహకారంతో అపార్ధాలు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం ధైర్యం పెరుగుతుంది. శివాల‌యాన్ని సంద‌ర్శించండి.

వృషభం

ధ‌న లాభం సూచితం. మనసులోని కోరికలు కొంతవరకు తీరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ విషయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. విమర్శలకు అవకాశం ఇవ్వద్దు కుటుంబములో చిన్నపాటి ఖర్చులు, ఉద్వేగాలకు లోను కాకూడదు, ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. వాతావరణ సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు వాటి మీద రుణములు తీసుకునుట కొరకు, పాత వాహనములు మార్చి కొత్తవి కొనుగోలు కొరకు ముఖ్యుల సహకారం ఆశిస్తారు. సంతానమునకు విదేశీ అవకాశములు ఉన్నాయి. అమ్మ‌వారిని ధ్యానించండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి రాజకీయ నాయకుల ఉన్నత అధికారులు సహకారం ఆశించేటప్పుడు వీలైనంత నిదానత అవసరం. పరాక్రమం పెరుగుతుంది. నూతన అంశాలు వృత్తిపరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వృత్తిపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. తల్లి సహకారం పొందుతారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాలలో పూర్తి శ్రద్ధ చూపించాలి. ఆర్థికంగా కొంత వరకు బాగుంటుంది. భాగస్వామికి నూతన అవకాశాలు గుర్తింపు గౌరవం శ్రమకు తగిన ప్రతిఫలం. గతం కంటే వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. వృత్తిలో అధికారుల సహకారం బాగుంటుంది. శ్రమ అధికమైనప్పటికీ కష్టించి పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇష్ట‌దేవ‌తా ఆరాధ‌న శుభ‌ప్ర‌దం.

కర్కాటకం

దైవ‌ కార్యాలలో పాల్గొనడం తదుపరి వృత్తిపరమైన బాధ్యతలు ఉన్నత వ్య‌క్తులతో పాటు రాజకీయ, కళాకారుల సహకారంతో అనుకున్న పనులు చక్కగా నిర్వర్తిస్తారు. ప్రయాణాలు, శ్రమ, ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆదాయం అభివృద్ధి. గృహ స్థిరాస్తుల విషయంలో ఆత్మీయులను సంప్రదిస్తారు. కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన. గృహాల్లోని వాతావరణంలో పనులలో ప్రశాంతత లోపించినప్పటికీ, ముఖ్యమైన విషయంలో తెలివిగా సరి చేయగలుగుతారు. సంతానం విషయంలో కొత్త బాధ్యతలు, కుటుంబంలోని వాతావరణము ఆహ్లాదకరంగా మిత్రుల ఆ రాకపోకలతో ఉంటుంది. కుటుంబంలో స్త్రీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమావేశాల్లో పాల్గొంటారు.

సింహం

భాగస్వామికి కొత్త | ప్రదేశానికి బదిలీలు కావ‌చ్చు. నూతన గృహ ప్రయత్నాలకు అవకాశము ఉంది. పౌరుషంగా ధైర్యంగా ఉంటారు. ఆకస్మిక కలహాలు మీ మాటల వల్ల లేకుండా జాగ్రత్త వహించాలి. సంతానానికి విద్య, వృత్తి అంశాలలో దూర ప్రదేశాలలో నూతనఅవకాశాలు ల‌భిస్తాయి. వృత్తిలో నూతన బాధ్యతలు, శ్రమ అలసట పెరిగినప్పటికీ గౌరవం కీర్తి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పనులు వాయిదా పడకుండా ముందు గానే ప్రణాళికలు వేసుకోవాలి. రావలసిన ధనం ఆలస్యంగానైనా అందుకుంటారు. మిత్రులను కలుస్తారు, తండ్రిగారి సహకారంతో నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. హ‌నుమాన్ ఆల‌యాన్ని సంద‌ర్శించండి.

కన్య‌

డ‌బ్బు పొదుపుకి ఆలోచనలు చేస్తారు. అనవసర ఖర్చుకి అవకాశము లేకుండా ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత విషయాల్లో జాగర్తగా అలోచించి నిర్ణయములు మేలు. వ్యక్తి గత ఆరోగ్యముపై శ్రద్ధ తీసుకుంటారు. అలసట పెరుగుతుంది. విదేశీ విషయాల్లో ఉన్నత విద్యలో శ్రద్ధ, స్త్రీలకు వృత్తి పరముగా కళలకు సంబంధిత అవకాశములు ఆకస్మిక ఖర్చులు, అనుకోని ప్రయాణములు, ప్రభుత్వ సంబంధ పనుల్లో బిజీగా ఉంటారు. టాక్సులు, మొదలైన విషయాల్లో బద్దకము లేకుండా వాయిదాలు లేకుండా పనులు చేసే ప్రయత్నములులో పౌరుషము ఉద్వేగాలకి లోనుక గొడదు. ముఖ్య అంశాలలో తోబుట్టువులతో ఆత్మీయులతో సంప్రదింపుల్లో ఆలోచనలు వాహన, భూసంబంధ స్థిర ఆస్తుల విషయాల్లో వివాహ ప్రయత్నాల్లో తాత్కాలిక ఆటంకములు ఉంటాయి. ల‌క్ష్మిదేవీని ఆరాధించండి.

తుల

నూతన వృత్తి కొరకు ఎదురు చూసేవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ అంశాలపై దృష్టి సారిస్తారు. సంతాన భవిష్యత్తు పరంగా ఎదురుచూస్తున్న వార్తలు అందుకుంటారు. విద్యార్థులకు విద్యాపరంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ మొదలైనవి కొనడం కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణ సంబంధ విషయాలు కొంతవరకు చెల్లిస్తారు, క్రీడాకారులకు, విద్యార్థులకు విజయం సాధించడానికి పోటీలలో పాల్గొనుటకు చేయు కృషి అధికమవుతుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులను సంప్రదించను చేస్తారు. గతంలో ఇచ్చిన రుణములు వసూలు అవుట కొంతవరకు కష్టంగా ఉంటుంది. శివారాధ‌న చేయండి.

వృశ్చికం

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిరకాల అంతరంగా శత్రువులపై విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. దర్పంగా ఉంటారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలలో ముందుకు వెళ్లడం కొరకు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. గృహ వాహన నిర్మాణ అంశాలలో, ఆర్థిక అంశాలలో తాత్కాలిక ఇబ్బందులు. వాగ్వాదములకు దూరంగా ఉండటం మేలు.

ధనుస్సు

సృజనాత్మక పెరుగుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతలు, సంతానానికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో మీ తరపు ప్రయత్నాలలో, సలహాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరమైన గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచనలు బావుంటాయి. విందు వినోదాలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆత్మీయులకు సలహాలు ఇస్తారు. జ్ఞాపకశక్తి బావుంటుంది. సంతానానికి సంబంధిత గాని, మీవి కాని దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచనలు చేస్తారు. తొందరపాటు తనం పనికిరాదు. కొత్త వ్యక్తులని త్వరగా నమ్మరాదు. నూతన పరిచయాలు ఆశాభంగాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక వాగ్వాదాలకు అవకాశం ఉంది. పట్టింపుల వల్ల ఉద్వేగాలు పెరగడం వల్ల ముఖ్యమైన వ్యక్తులతో, అభిప్రాయ భేదాలకు అవకాశం ఇవ్వరాదు. భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి.

మకరం

ఎదురుచూస్తున్న విషయాలలో కృషి అధికం చేస్తారు. ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి. వృత్తిపరంగా నూతన అవకాశాలకి కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. వృత్తిపరంగా అధికారులతోనూ, రాజకీయ నాయకులుతోనూ అభిప్రాయ బేధములు రాకుండా ఉండాలి. భాగస్వామీ తాత్కాలిక ఎడబాటు, ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు. బద్ధకంతో వాయిదాలు వేస్తారు. అలా కాకుండా యోగ ప్రాణాయామము చేయడం మంచిది. పోటీలలో అధిక శ్రమ చూపిస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. రుణములు చెల్లించి అంశాల్లో దృష్టి సారిస్తారు. ఆర్థికపరంగా అభివృద్ధి. సంతానానికి నూతన అవకాశములు ఉన్నాయి. దైవ సంద‌ర్శ‌నం శుభ ఫ‌లితాలు అందిస్తుంది.

కుంభం

కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉంటాయి, మాటల వల్ల అపార్థం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికమైన అంశాలలో, ముఖ్యమైన పనిలో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాల్లో ముందుంటారు. వాహనమును నడిపేటప్పుడు, భూ సంబంధ పెట్టుబడుల విషయంలోనూ, పోటీలలో, రావలసిన ఆదాయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగదు. పట్టుదలగా కృషి చేసి అనుకున్న పనులలో నెమ్మదిగా విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కార్యక్రమాల్లో జయం. పేరు ప్రఖ్యాతలు గౌరవం పెరుగుతుంది. శ్రమకి తగిన గుర్తింపు ల‌భిస్తుంది. విష్ణు స‌హ‌స్ర‌ నామాన్ని జంపించండి.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు సమయస్పూర్తితో మృదువైన మాటలతో, అనుకున్న పని సాధించడానికి కృషి చేస్తారు. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా శక్తికి మించి ఉన్నప్పటికీ ముందుకు వెళతారు. ముఖ్యమైన కార్యక్రమంలో నిమగ్నమై ఆహార, విశ్రాంత విషయంలో నిర్లక్ష్యం తగదు. పరాక్రమం పెరుగుతుంది. క్రింది వారు సహకరిస్తారు. ఆత్మీయులైన పెద్దలు గురువుల ఆశీస్సులతో వ్యక్తిగత విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాహన సంబంధ అంశాలలో పెట్టుబడుల కొరకు, అమ్మకాల కొరకు ఆలోచనలు. తోబుట్టువుల వైఖరి మనసుని ప్రశాంతత లేకుండా చేస్తుంది. భాగస్వామితో సంప్రదించి స్థిరాసుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనములు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000