Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : మానసిక ఇబ్బందులు.. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు-today horoscope in telugu based on career and life for 14th december 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : మానసిక ఇబ్బందులు.. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : మానసిక ఇబ్బందులు.. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 14, 2022 04:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? డిసెంబర్ 14వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

రాశిఫలాలు
రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (14-12-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయండి.

వృషభ రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అలసిపోతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

మిధున రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగుతుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్తే మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. శారీర శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసికంగా ఆనందం పొందుతారు. ధనలాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల సహాయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కొన్ని చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయండి.

మీన రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం