Health issues in may month: మే నెలలో ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు.. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి-these zodiac signs get health issues in may month to be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Health Issues In May Month: మే నెలలో ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు.. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి

Health issues in may month: మే నెలలో ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు.. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి

Gunti Soundarya HT Telugu
May 03, 2024 01:02 PM IST

Health issues in may month: మే నెలలో గ్రహాల స్థానం వల్ల కొన్ని రాశుల వారికి ఆరోగ్య సమస్యలు ఎదురుకాబోతున్నాయి. ఏయే రాశుల వాళ్ళు అనారోగ్య సమస్యలు ఎదుర్కోబోతున్నారో చూసుకోండి. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే రాశులు ఇవే
మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే రాశులు ఇవే (pixabay)

ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశం ఆరోగ్యం. పని జీవితంలో బిజీగా ఉండటం, అస్తవ్యస్తమైన జీవనశైలిని అవలంభించడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. 

ఒక వ్యక్తి జాతకంపై వివిధ గ్రహాల ప్రభావం కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్య పరిస్థితి నిర్దిష్ట గృహాలలో గ్రహాల సరైన స్థానం, సంచారం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. మే నెలలో కొన్ని రాశుల వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా వారి జీవితాలు ఇబ్బందుల్లోపడతాయి. మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేష రాశి

మే నెలలో మేష రాశి వారి ఆరోగ్య పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశికి అధిపతి కుజుడు. రాహువుతో కలిసి 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు మరింత దిగజారుతాయి. ఈ కాలంలో వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు, దద్దుర్లు లేదా అలర్జీ వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రక్త పోటుకు సంబంధించి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మేష రాశి వారికి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు మే నెలలో ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. మే నెలలో సూర్యుడు, బృహస్పతితో కలిసి శుక్రుడు 12వ ఇంట్లో సంచరిస్తాడు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారం, బయట ఆహారాన్ని తినడం వల్ల వివిధ రకాల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

కర్కాటక రాశి

ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి ఈనెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. శని మీ రాశి ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. తొమ్మిదవ ఇంట్లో కుజుడు, రాహువు వల్ల అంగారక దోషం ఉంటుంది. దీని వల్ల కర్కాటక రాశి వారికి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలను నివారించుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీళ్ళు తాగి మీ దినచర్య ప్రారంభించాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. 

తులా రాశి

తులా రాశి వారికి జీవితంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశి ఆరో ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. మొటిమలు వంటి చర్మ సంబంధిత వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించాలి. ఇక ఎనిమిదో ఇంట్లో దేవగురువు బృహస్పతి స్థానం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మే 14 నుండి సూర్యుడు ఈ రాశి ఎనిమిదో ఇంట్లో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టతరమవుతుంది. అందుకే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా విమర్శించవద్దు. సరైన సమయపాలనతో మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది. 

వృశ్చిక రాశి

ఆరోగ్యపరంగా ఈనెల వృశ్చిక రాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. గ్రహ స్థానం వల్ల వృశ్చిక రాశి వారికి ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. సరైన సమయంలో వైద్యులను సంప్రదించాలి. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. దేవ గురువు బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కాలక్రమేణా ఆరోగ్య పరిస్థితి కుదుటపడతాయి. అయితే కుజుడు, రాహువు అంగారక దోషం ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 

ధనుస్సు రాశి

మే నెలలో ధనుస్సు రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఆరో ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా ఈ నెల మొత్తం బలహీనంగా ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఆరోగ్య సమస్యలు విస్మరించకుండా సరైన చర్యలు పాటించాలి. వ్యాయామం, యోగా చేయాలి. ఆరోగ్య నిపుణులను నిరంతరం సంప్రదించడం మంచిది. 

మీన రాశి

మీన రాశి వారికి మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బృహస్పతి మూడో ఇంట్లో ఉంటాడు. సోమరితనం వల్ల శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు, కుజుడు, బుధుడు మొదటి ఇంట్లో కలిసి ఉంటారు. ఫలితంగా కంటినొప్పి, మానసిక సమస్యలు, తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సకాలంలో చికిత్స పొందితే ఆరోగ్యంగా జీవించగలుగుతారు.