Dasara 2024: దసరా రోజు అదృష్టం వరించాలంటే మీరు చేయాల్సిన ఐదు పనులు ఇవే
Dasara 2024: హిందూమతంలో దసరా పండుగ ఎంతో ముఖ్యమైనది. ఇది ఎంతో పవిత్రమైన పండుగ కూడా. ఆరోజు చేసే కొన్ని పనులు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని నమ్ముతారు.
దసరాను ప్రపంచంలోని హిందువులంతా ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయనికి, చెడుపై మంచి గెలిచినందుకు ప్రతీకగా దసరాను నిర్వహించుకుంటారు. పురాణాల ప్రకారం రాముడు రాక్షసుడైన రావణుడితో సుదీర్ఘ యుద్ధం తర్వాత అతడిని ఓడిస్తాడు. రావణుని నాశనం చేసిన రోజే దసరా అని చెప్పుకుంటారు. రావణుడిపై రాముడు విజయానికి గుర్తుగా విజయ దశమి నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. మరొక పౌరాణిక గాధలో దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని తొమ్మిది రోజులు పాటు యుద్ధంలో పోరాడి ఓడించింది. దీనికి గుర్తుగా కూడా భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను నిర్వహించుకుంటారు. ఆరోజు కొన్ని పనులు ఇంటికి లేదా వ్యాపార ప్రాంతానికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయని నమ్ముతారు.
ఇంట్లోనైనా వ్యాపారం చేసే ప్రాంతాల్లోనైనా దసరాకి ముందుగానే పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉండే ఇళ్లను దేవతలు ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఇల్లు ఉద్యోగ ప్రాంతం, వ్యాపార స్థలం ఏదైనా కూడా ఆ స్థలాన్ని గోమూత్రం చల్లి శుభ్రం చేసి అగరబత్తీలను వెలిగించాలి .
దసరా రోజు బంగారు ఆభరణాలు, వాహనాలు, ఫ్లాట్లు, ఇల్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కొనుగోలు చేస్తే ఎంతో మంచిది. బంగారం లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. కాబట్టి వస్తువులు ఇలాంటి వస్తువులు కొంటే అదృష్టం, శ్రేయస్సు దక్కుతుందని నమ్ముతారు. దసరా రోజు వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా ఎంతో మేలు జరుగుతుంది.
దసరా రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద తిలకం దిద్ది బంతి పువ్వులను కట్టండి. అలాగే పనిముట్లు, మీరు వాడే ఆయుధాలకి కూడా తిలకం దిద్ది పూలదండలు వేయండి. ఇది మీకు విజయాన్ని అదృష్టాన్ని అందిస్తుంది.
ఆవులు వంటి పెంపుడు జంతువులకు దసరా రోజున ఆహారాన్ని ప్రత్యేకంగా అందించండి. దసరా రోజున ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం పెడితే అన్నదానం చేసినంత శుభ ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఉన్న జంతువులకే కాదు, బయట తిరిగే జంతువులకు కూడా అన్నదానం చేయడం వల్ల మీకు అంత మంచే జరుగుతుంది.
దసరా రోజున మీ కుల దేవతలకు, స్థానిక దేవతలకు ప్రసాదం సమర్పించడం మర్చిపోవద్దు. వారి ఆశీర్వాదాలు తీసుకోవడం వంటివి చేయండి. ఇది మీకు ఎంతో మంచిది.