Saturn retrograde: శని తిరోగమనం.. ఈ రాశుల వారికి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది-saturn retrograde in kumbha rashi these zodiac signs get benefits in next few months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Retrograde: శని తిరోగమనం.. ఈ రాశుల వారికి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది

Saturn retrograde: శని తిరోగమనం.. ఈ రాశుల వారికి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది

Gunti Soundarya HT Telugu
Apr 29, 2024 11:18 AM IST

Saturn retrograde: శని త్వరలోనే తన కదలిక మార్చుకోబోతున్నాడు. కుంభ రాశిలో జూన్ నెల నుంచి తిరోగమన దశలో సంచరించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది.

శని తిరోగమనం
శని తిరోగమనం

Saturn transit: నవగ్రహాలు ఒక రాశిని విడిచి మరొక రాశిలోకి ప్రయాణం చేసినప్పుడు దాని ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై ఉంటుంది. శని సంచారంతో కొందరికి అత్యంత అనుకూలమైన ఫలితాలు కలిగితే మరికొందరు దాని ప్రభావం కారణంగా కష్టతరమైన సమయాన్ని అనుభవిస్తారు. అందుకే శని కర్మల ఫల దాత అంటారు. మంచి పనులు చేస్తే శని అనుగ్రహం ఉంటుంది.

అన్ని గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతుంది. ఈ గ్రహం కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది మొత్తం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోనే ఉంటాడు. అయితే తన కదలికలను మార్చుకుంటూ ఉంటాడు. శని త్వరలోనే తన కదలికను మార్చుకోబోతున్నాడు.

జూన్ నెలలో శని తిరోగమన దశలో సంచరిస్తాడు. జూన్ 29 శని కుంభ రాశిలో తిరోగమనం చెందుతాడు. శని గమన మార్పు నవంబర్ 15 వరకు ఉంటుంది. రానున్న 137 రోజులు శని ఈ రాశుల వారికి అనేక ప్రయోజనాలు ఇవ్వనున్నాడు. శని తిరోగమనం కారణంగా ఏయే రాశులకు అదృష్టం కలుగుతుందో చూద్దాం. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

మేష రాశి

శని తిరోగమనం మేష రాశి జాతకులకు అనుకూలమైనదిగా ఉంటుంది. ఈ సమయం వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యాపారస్థులకు భారీ ఒప్పందాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతో ఆనందకరంగా ఉంటుంది. ఆర్థికంగా పూర్తి లాభాలు ఉంటాయి. కొత్త జాబ్ ఆఫర్లు కూడా పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం పొందుతారు.

వృషభ రాశి

శని తిరోగమన సంచారం వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శని తిరోగమనం వృషభ రాశి వారికి అదృష్టంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

శని కదలిక మార్పు వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కెరీర్లో మీకు అనుకూలమైన అవకాశాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఆగిపోయిన పనులు సులువుగా పూర్తవుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్లో మంచి ఫలితాలు, రాబడి పొందుతారు.

కన్యా రాశి

శని తిరోగమన ప్రభావంతో కన్యా రాశి వారికి వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళతారు. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి మంచి లాభాలు గడిస్తారు. నవంబర్ నెల వరకు ఈ రాశి వారికి శని ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది.

Whats_app_banner