Rahu nakshtra transit: జులై 8 నుంచి ఈ రాశులకు శుభ సమయం.. రాహువు వీరి కలలను నెరవేర్చబోతున్నాడు-on july 8th these zodiac signs get good days because rahu enter shani nakshatram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Nakshtra Transit: జులై 8 నుంచి ఈ రాశులకు శుభ సమయం.. రాహువు వీరి కలలను నెరవేర్చబోతున్నాడు

Rahu nakshtra transit: జులై 8 నుంచి ఈ రాశులకు శుభ సమయం.. రాహువు వీరి కలలను నెరవేర్చబోతున్నాడు

Gunti Soundarya HT Telugu
Jun 25, 2024 12:25 PM IST

Rahu nakshtra transit: జులై 8 నుంచి రాహువు శనికి చెందిన నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ సమయం ప్రారంభంఅవుతుంది. రాహువు ఆయా రాశుల వారి కలలు నెరవేర్చబోతున్నాడు.

రాహువు నక్షత్ర మార్పు
రాహువు నక్షత్ర మార్పు

Rahu nakshtra transit: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అంతుచిక్కని గ్రహంగా పరిగణిస్తారు. ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తుంది. ఒక్కో రాశి మారేందుకు 18 నెలల సమయం పడుతుంది. గతేడాది మీన రాశిలోకి ప్రవేశించిన రాహువు వచ్చే ఏడాది తదుపరి రాశి మార్పు జరుగుతుంది.

రాహువు ఈ ఏడాది రాశి మారకపోయినప్పటికీ నక్షత్రాన్ని మార్చుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తాడు. త్వరలో రాహువు శనికి చెందిన నక్షత్రంలో సంచరించబోతున్నాడు. నవగ్రహాలలో శని గ్రహాన్ని న్యాయనిర్ణేతగా పరిగణిస్తారు. శని, రాహువుల మధ్య స్నేహపూర్వక భావన ఉంది. అటువంటి పరిస్థితిలో త్వరలో శని, రాహువు కలిసి ఆసక్తికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. జూలై 8న రాహువు శని గ్రహానికి చెందిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని నక్షత్రంలోకి రాహువు రాక కొన్ని రాశులకు చాలా మేలు చేస్తుంది. రాహువు నక్షత్ర మార్పు కారణంగా ఈ రాశులవారు ఆర్థిక పురోగతిని, వృత్తిలో విజయాన్ని పొందుతారు. అవి ఏ రాశులో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

రాహువు నక్షత్ర మార్పు మేష రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. వ్యాపారులకు ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది. జులై 8 నుంచి ఈ రాశి వారికి అనుకూల సమయం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ కాలంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల భూమి, భవన, వాహన కొనుగోలుకు అవకాశం ఉంటుంది.

మిథున రాశి

రాహు నక్షత్ర మార్పు మిథునరాశి వారికి మేలుకరమైన ప్రయోజనాలు ఇస్తుంది. రాహువు ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మొత్తంమీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి

రాహు నక్షత్ర మార్పు సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ అసంపూర్తిగా ఉన్న పనిని ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఊహించని ధనలాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. విదేశీ ఒప్పందాలు చేసుకునే అవకాశాల లభిస్తుంది. ఈ ఒప్పందాలు భారీ లాభాలను ఇస్తాయి.

తులా రాశి

ఈ సమయం తులా రాశి వారికి స్వర్ణ కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని ఆహ్లాదకరమైన శుభవార్తలను అందుకోవచ్చు. ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఎంతోకాలంగా తీరని కల ఏదైనా ఈ సమయంలో నెరవేరవచ్చు.

మకర రాశి

మకర రాశికి శని అధిపతి. శని రాహువు స్నేహపూర్వక సంబంధం ఉండటం వల్ల వీరికి లాభదాయకమైన ప్రయోజనాలు చేకూరతాయి. రాహువు మకర రాశి వారికి శుభవార్త ఇస్తాడు. ఈ సమయం మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు. మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. శుభవార్తలు అందుకోవడానికి అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel