Saturn retrograde: 5 నెలల పాటు శని తిరోగమన కదలిక.. ఈ రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు-on june 29th towards these zodiac signs get shani dev blessings after saturn retrograde position ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Retrograde: 5 నెలల పాటు శని తిరోగమన కదలిక.. ఈ రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు

Saturn retrograde: 5 నెలల పాటు శని తిరోగమన కదలిక.. ఈ రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Jun 24, 2024 07:00 PM IST

Saturn retrograde: శని మరికొద్ది రోజుల్లో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. 3 రాశుల వాళ్ళు ఐదు నెలల పాటు అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా గడుపుతారు.

శని తిరోగమనం
శని తిరోగమనం

Saturn retrograde: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు ఒక వ్యక్తికి అతని కర్మల ఆధారంగా మంచి, చెడు ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుని అనుగ్రహంతో ఒక వ్యక్తి జీవితంలో ప్రతి అడ్డంకిని అధిగమిస్తాడు. చాలా పురోగతి, విజయాన్ని సాధిస్తాడు. అదే సమయంలో, శనిదేవుని అశుభ దృష్టి ఒక వ్యక్తిని రాజు నుండి పేదవాడిగా మారుస్తుంది.

దృక్ పంచాగ్ ప్రకారం జూన్ 29 అర్థరాత్రి 12:35 గంటలకు కుంభ రాశిలో శనిగ్రహం తిరోగమనం చేయబోతున్నాడు. శని దాదాపు 5 నెలల పాటు అంటే నవంబర్ 15, 2024 వరకు తిరోగమన స్థితిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మేషం నుండి మీనం వరకు 12 రాశులపై శని తిరోగమనం శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది. ఈ కాలం కొన్ని రాశిచక్ర గుర్తులకు బాధాకరంగా ఉంటుంది. అయితే ఇతరుల జీవితాల్లో ఆనందం మాత్రమే వస్తుంది. శని తిరోగమనం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

శని తిరోగమన కాలం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. భూమి, ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి, ఆర్థిక జీవితంలో గొప్ప విజయాన్ని నమోదు చేస్తూ ముందుకు సాగుతారు. వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కుంభ రాశి

శని ఈ రాశికి అధిపతి. కుంభ రాశిలోనే తిరోగమనం చెందబోతున్నాడు. ఫలితంగా వీరికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపార స్థానం బలోపేతం అవుతుంది. కెరీర్‌లో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రతి రంగంలో పురోగతికి లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి. విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. శని తిరోగమన దశ అదృష్టాన్ని ఇస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. తోబుట్టువులతో సంబంధం మరింత ప్రేమగా మారుతుంది.

మకర రాశి

మకర రాశికి కూడా శని అధిపతి. శని తిరోగమన స్థితి మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ వైవాహిక జీవితంలో సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కెరీర్‌లో అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన లాభాలు పొందుతారు. సమాజంలో ఉన్నతమైన గౌరవం లభిస్తుంది. మీ ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు.

శని గ్రహాన్ని శాంతింపజేయడానికి ఈ నివారణలు పాటించడం ఉత్తమం. రొట్టెలో నూనె వేసి నల్ల కుక్కకు తినిపించాలి. నల్ల గుర్రపు షూతో తయారు చేసిన ఉంగరాన్ని మధ్య వెళుకు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి.

WhatsApp channel