Maha lakshmi yogam: కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక.. మహాలక్ష్మీ యోగంతో వెలిగిపోయే రాశులు ఇవే-maha lakshmi yogam will form in kumbha rashi after 4 days these zodiac signs will get huge benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Maha Lakshmi Yogam Will Form In Kumbha Rashi After 4 Days These Zodiac Signs Will Get Huge Benefits

Maha lakshmi yogam: కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక.. మహాలక్ష్మీ యోగంతో వెలిగిపోయే రాశులు ఇవే

Gunti Soundarya HT Telugu
Mar 11, 2024 02:12 PM IST

Maha lakshmi yogam: రాశిలో మూడు గ్రహాల కలయిక జరగబోతుంది. ఫలితంగా మహాలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూద్దాం.

కుంభ రాశిలో మహాలక్ష్మీ యోగం
కుంభ రాశిలో మహాలక్ష్మీ యోగం (freepik)

Maha lakshmi yogam: మరి కొద్ది రోజుల్లో శక్తివంతమైన అంగారక గ్రహం రాశి మారబోతున్నాడు. ప్రస్తుతం శనికి చెందిన మకర రాశిలో ఉన్న కుజుడు కుంభ రాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇప్పటికే అక్కడ సంపదని ప్రసాదించే శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ రాశిలోనే శని గత ఏడాది నుంచి సంచరిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

అంగారకుడు ప్రవేశించిన వెంటనే కుంభ రాశిలో శని, కుజుడు, శుక్రుడు గ్రహాల సంయోగం జరగనుంది. మార్చి 15న ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడనుంది. మార్చి 30 వరకు ఈ యోగం ఉంటుంది. ఫలితంగా పదిహేను రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం అండగా ఉండబోతుంది.

శుక్రుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా పొందినట్టే. ఈ నెలలో శుక్రుడు రెండు సార్లు రాశి చక్రం మార్చుకుంటాడు. మార్చి 31న శుక్రుడు కుంభ రాశిని వదిలి మీన రాశి ప్రవేశం చేస్తాడు. మహాలక్ష్మి యోగం వల్ల ఏ ఏ రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారో చూద్దాం.

మేష రాశి

మూడు గ్రహాల కలయికతో వచ్చే మహాలక్ష్మి యోగం మేష రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఏదైనా కొత్త పని ఈ సమయంలో ప్రారంభించడం శుభప్రదం. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు క్రమంగా సమసిపోతాయి. ఆర్థిక రంగంలో పురోభివృద్ది ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మహాలక్ష్మి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. అవగాహనతో ప్రతి సమస్యని పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు చేతికి అందుతుంది.

మిథున రాశి

శని, కుజుడు, శుక్రుడు సంయోగం వల్ల మిథున రాశి వారికి సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడిదారులు దొరుకుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి అంగారకుడు మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. మూడు గ్రహాల శుభ ప్రభావంతో ఈ రాశి వారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. సంపద పెరుగుతుంది.

కుంభ రాశి

కుంభ రాశిలోనే ఈ మూడు గ్రహాలు కలయిక జరుగుతుంది. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు యోగాల ప్రభావం కారణంగా మీ గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆస్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్ లో అన్ని పనులు చక్కబెట్టుకుంటారు.

WhatsApp channel