Krishnashtami puja time: జన్మాష్టమి 26 లేదా 27 ఎప్పుడు జరుపుకోనున్నారు? పూజకు శుభ సమయం ఎప్పుడు?-krishnashtami august 26 or 27 what is the best time to worship lord krishna ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krishnashtami Puja Time: జన్మాష్టమి 26 లేదా 27 ఎప్పుడు జరుపుకోనున్నారు? పూజకు శుభ సమయం ఎప్పుడు?

Krishnashtami puja time: జన్మాష్టమి 26 లేదా 27 ఎప్పుడు జరుపుకోనున్నారు? పూజకు శుభ సమయం ఎప్పుడు?

Gunti Soundarya HT Telugu
Aug 24, 2024 09:23 AM IST

Krishnashtami puja time: గ్రంధాల ప్రకారం శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలోని బహుళ పక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ ఏడాది జన్మాష్టమి 26 లేదా 27 ఎప్పుడు జరుపుకోనున్నారు? కృష్ణుడిని పూజించడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకోండి.

జన్మాష్టమి పూజా సమయం
జన్మాష్టమి పూజా సమయం

Krishnashtami puja time: దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటారు. 2024 జన్మాష్టమి ప్రత్యేకం కానుంది. ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఏర్పడిన యోగాలే ఈ ఏడాది జన్మాష్టమి నాడు రూపొందుతున్నాయి.

జన్మాష్టమి 26 లేదా 27 ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని గురించి చాలా మందిలో గందరగోళం నెలకొంది. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి పండుగను 26 ఆగస్ట్ 2024 సోమవారం జరుపుకుంటారు. దేశంలోని నగరాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజా సమయాన్ని తెలుసుకోండి.

శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ సమయం

ఈ సంవత్సరం శ్రీ కృష్ణ భగవానుడి 5251వ జయంతి. ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్ట్ 27వ తేదీ తెల్లవారుజామున 12.44 గంటల వరకు కృష్ణ జన్మాష్టమికి పూజాదికాలు జరుపుకుంటారు.

ఉట్టి కొట్టడం ఎప్పుడు?

కొన్ని ప్రదేశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు దహి హండి(ఉట్టి కొట్టడం) పండుగ కూడా జరుపుకుంటారు. దహీ హండి మంగళవారం, 27 ఆగస్ట్ 2024న జరుపుకుంటారు.

రోహిణి నక్షత్రం ఎప్పుడు ఉంటుంది?

అష్టమి తిథి ఆగస్ట్ 26వ తేదీ తెల్లవారుజామున 03:39 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 27వ తేదీ తెల్లవారుజామున 02:19 వరకు కొనసాగుతుంది. రోహిణి నక్షత్రం ఆగస్ట్ 26న మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 27న మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది. చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. కృష్ణుడు జన్మించినప్పుడు ఇలాంటి యోగం ఏర్పడిందని మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా పునరావృతం కావడం అదృష్టమని పండితులు తెలిపారు. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతుంది.

ఇతర నగరాల్లో కృష్ణ జన్మాష్టమి ముహూర్తం

12:13 AM నుండి 12:59 AM, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - పూణే

12:01 AM నుండి 12:45 AM వరకు, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - న్యూఢిల్లీ

11:48 PM నుండి 12:34 AM వరకు, ఆగస్ట్ 26 - చెన్నై

12:06 AM నుండి 12:51 AM వరకు, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - జైపూర్

11:55 PM నుండి 12:41 AM వరకు, ఆగస్ట్ 26 - హైదరాబాద్

12:01 AM నుండి 12:46 AM, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - గురుగ్రామ్

12:03 AM నుండి 12:47 AM వరకు, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - చండీగఢ్

11:16 PM నుండి 12:01 AM వరకు, ఆగస్ట్ 26- కోల్‌కతా

12:17 AM నుండి 01:03 AM వరకు, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - ముంబై

11:58 PM నుండి 12:44 AM వరకు, ఆగస్ట్ 26 - బెంగళూరు

12:19 AM నుండి 01:04 AM, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - అహ్మదాబాద్

12:00 PM నుండి 12:44 AM వరకు, ఆగస్ట్ 26(అర్థరాత్రి అంటే ఆగస్ట్ 27) - నోయిడా

శుభ ముహూర్తం

బ్రహ్మ ముహూర్తం- 04:26 AM నుండి 05:11 AM వరకు

ఉదయం సాయంత్రం- 04:49 AM నుండి 05:55 AM వరకు

అభిజిత్ ముహూర్తం- 11:56 AM నుండి 12:47 PM వరకు

విజయ్ ముహూర్తం- 02:31 PM నుండి 03:22 PM వరకు

సంధ్య ముహూర్తం- 06:48 PM నుండి 07:10 PM వరకు

అమృత కాలం - 01:36 PM నుండి 03:09 PM వరకు

నిశిత ముహూర్తం- 12:00 PM నుండి 12:44 AM, ఆగస్ట్ 27

సర్వార్థ సిద్ధి యోగం- 03:55 PM నుండి 05:56 AM వరకు, ఆగస్ట్ 27

పూజా సమయం

ఉదయం 5.40 నుండి 7.15 వరకు

ఉదయం 9 నుండి 10.25 వరకు

మధ్యాహ్నం 1.35 నుంచి రాత్రి 7.45 వరకు

రాత్రి 10.35 నుంచి 11.59 వరకు

రాత్రి 1.25 నుంచి 2.50 వరకు

ఉపవాసం విరమించే సమయం

మత గ్రంధాల ప్రకారం ఉపవాసం విరమించే సమయం ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ఉంటుంది.