జ్యేష్ట అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు-know the significance of jyeshtha amavasya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జ్యేష్ట అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు

జ్యేష్ట అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు

HT Telugu Desk HT Telugu
Jun 16, 2023 11:13 AM IST

జ్యేష్ట మాసములో వచ్చే అమావాస్య పితృదేవతారాధనకు చాలా విశేషమైనటువంటి రోజు.

జ్యేష్ట అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించాలి
జ్యేష్ట అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించాలి

జ్యేష్ట అమావాస్య తిధి రోజు పితృ తర్పణాలకు, పిండదానాలకు, అలాగే దానధర్మాలు ఆచరించడానికి ఉత్తమమైనటువంటి రోజుగా శాస్త్రములు తెలిపాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

జ్యేష్ట అమావాస్య అమావాస్యలలో ప్రత్యేకమైనది. జ్యేష్ట అమావాస్యరోజు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ట అమావాస్యని శని అమావాస్య అని కూడా అంటారు. కర్మప్రదాత అయినటువంటి శని జ్యేష్ట అమావాస్య రోజు జన్మించినట్లుగా కూడా కొన్ని పురాణాలు తెలియచేస్తున్నాయి.

జ్యేష్ట అమావాస్యరోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం నవగ్రహ పూజలు ఆచరించడం వల్ల గ్రహపీడలు తొలగుతాయని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.

జ్యేష్ట అమావాస్య రోజు పుణ్యనదీ స్నానాలు ఆచరించడం అనగా గంగ, కావేరి, యమున, గోదావరి, కృష్ణ వంటి పుణ్య నదులలో స్నానమాచరించి దేవతలను పూజించాలి. పితృదేవతలకు తర్చణాలు వదలడం మంచిది. స్త్రీలు ఈరోజు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి కోరికలు నెరవేరి సౌభాగ్యం కలుగుతుంది.

ఈ జ్యేష్ట అమావాస్య రోజు దశరథ శనిప్రోక్త స్తోత్రాన్ని పఠించడం, శివాష్టకం పఠించడం, దేవీ ఖద్దమాలా వంటివి చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner