Jupiter retrograde: బృహస్పతి తిరోగమనం- 2025 ఫిబ్రవరి వరకు ఈ రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Jupiter retrograde: బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దశలోకి వెళ్లబోతున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి కెరీర్, వ్యాపారం మీద ఎక్కువగా ఉండబోతుంది. అదృష్టం అనుకూలంగా మారడం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది. గురు గ్రహం ఏ రాశులకు అదృష్టం ఇస్తుందో చూడండి.
Jupiter retrograde: నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవగురువు బృహస్పతిగా చెప్తారు. ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ 9 నుంచి ఉదయం 10.01 గంటలకు తిరోగమనం చెందుతాడు. 5 ఫిబ్రవరి 2025 వరకు ఇదే దశలో సంచరిస్తాడు.
నవరాత్రుల సమయంలో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది. ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. కెరీర్ లో గొప్ప అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం నిండిపోతుంది. వృషభ రాశిలో బృహస్పతి తిరోగమనం చెందటం వల్ల సానుకూల ఫలితాలు పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనం చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్ష్యాలను సాధించడంలో విజయవంతం అవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి రావడంతో సంతోషంగా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారం మీద దృష్టి సారిస్తే మంచి లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి
బృహస్పతి తిరోగమనం కర్కాటక రాశి వారికి అదృష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా పురోగతి సాధిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతాల పెరుగుదల ఉంటుంది. డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది. పురోగతి వృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీరు వేసుకునే ప్రణాళికలు, వ్యూహాలు విజయవంతం అవుతాయి.
కన్యా రాశి
గురు గ్రహ తిరోగమన సంచారం కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు, పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. దాని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ కృషి వల్ల అధిక లాభాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బృహస్పతి అన్నీ రకాల భౌతిక సుఖాలను ఇవ్వబోతున్నాడు. కెరీర్ లో అపారమైన విజయాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. జీతం కూడా పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. దీని వల్ల భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు పొందుతారు. ఈ కాలంలో మీరు తెలివిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు పురోగతికి మార్గాలను సుగమం చేస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. పిల్లలు వృద్ధి చెందడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉండి. కానీ మంచి ఆదాయం కూడా ఉంటుంది.
ధనుస్సు రాశి
బృహస్పతి తిరోగమనం ధనుస్సు రాశి వారికి అదృష్ట కాలంగా మారుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మనసుకు సంతోషాన్ని కలిగించే కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు పొందుతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు మీ కెరీర్ కు చాలా సహాయపడతాయి. కార్యాలయంలో మీరు చేసే ప్రయత్నాలకు ప్రశంసలు దక్కుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.