Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై అష్టమ శని ప్రభావం!-horoscope today in telugu know your zodiac sign on the day of november 8 lunar eclipse 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Know Your Zodiac Sign On The Day Of November 8 Lunar Eclipse 2022

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై అష్టమ శని ప్రభావం!

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 05:02 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ నవంబర్ 08, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today in Telugu:
Horoscope Today in Telugu: (Unsplash)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 08.11.2022

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: కార్తీకము

వారం: మంగళవారం, తిథి: శు. పూర్ణిమ నక్షత్రం: భరణి

మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఈ వారం జన్మ రాహువు వ్యవయ స్థానమునందు గురువు కళత్ర రవి కేతువుల ప్రభావంచేత ప్రతి పనియందు చికాకులు అధికముగా ఉండును. పోరాడి పనులు పూర్తి చేసుకోవలసినటువంటి స్థితి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము. స్త్రీలకు కుటుంబమునందు మానసిక ఇబ్బందులు ఏర్పడును. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని సూచన. శని కుజ శుక్రుల అనుకూల స్థితి వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మేషరాశివారు మరింత శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము కలుగును. శత్రువులమీద విజయము పొందెదరు. ద్వితీయ స్థానము కుజుడు, వ్యయ స్థానము రాహువు ప్రభావంచేత కుటుంబ ఖర్చులతో గొడవలు ఏర్పడు సూచన. అనవసరంగా సలహాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. ప్రయాణములు అనుకూలించును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మృష్టాన్న భోజన ప్రాప్తి. వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ శని జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత మానసిక వేదనలు, ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు అధికమగును. పనులయందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. మిథున రాశి వారికి ఈ వారం ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువుల కోసం కుటుంబ అవసరాల కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. చతుర్ధ స్థానమునందు కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి. శని వక్రియై సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి. కర్కాటక రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, సౌఖ్యము కలుగును. అష్టమ గురుని ప్రభావంముచేత సింహరాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఉ ద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. అష్టమ గురుని ప్రభావము చేత సింహరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటివారం. సింహరాశి వారు ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. సింహరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

కన్య రాశి :

కన్యరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణములు లాభించును. కన్యరాశి వారికి ఈ వారం ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటి మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయము పొందెదరు. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో , కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. కన్యారాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి బుధ శుక్ర కేతువుల ప్రభావం చేత మానసిక ఘర్షణలు, ఒత్తిళ్ళు అధికమగును. ఉద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడులు ఏర్పడును. కుటుంబ విషయాలయందు జాగ్రత్త వహించాలి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. భాగ్యస్థానము నందు గురుడు అనుకూలత వలన ప్రయాణములు అనుకూలించును. లాభములు కలుగును. సౌఖ్యము పొందెదరు. శత్రువులతో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు కేతువు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ, పనులు అధికమగును. ప్రయాణములు అనుకూలించును. ముఖ్యమైన వస్తువుల కోసం ధనము ఖర్చు చేసెదరు. వ్యయస్థానము రవి, శుక్ర, కేతువుల ప్రభావం వలన ఖర్చులు పెరుగును. దాన ధర్మములు అధికముగా చేసెదరు. శని అనుకూల ప్రభావము చేత, పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధన లాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది. వృశ్చిక రాశివారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు కలుగును. గొడవలకు దూరంగా ఉండటం మంచిదని సూచన. సమాజము నందు కీర్తి కలుగును. ప్రయాణములు అనుకూలించును. లాభ స్థానము నందు కేతువు, రవి, శుక్రుడు ప్రభావం చేత ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి. ధనూ రాశివారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి రాహువు, కుజ, శుక్ర గ్రహాల అనుకూలత వలన ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగును వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. గత కొంత కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చును. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఏలినాటి శని ప్రభావంచేత ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. శత్రువుల బాధలు అధికముగా ఉండును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును. మకర రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి రాహువు, కుజ, శుక్ర గ్రహాల అనుకూలత వలన ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగును వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. గత కొంత కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చును. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఏలినాటి శని ప్రభావంచేత ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. శత్రువుల బాధలు అధికముగా ఉండును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు గురుడు, అష్టమ స్థానం రవి, బుధ, శుక్రుల ప్రభావం చేత మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మానసిక ఆందోళనలు పెరుగును. ఆరోగ్య విషయములలో జాగ్రత్త వహించాలి. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. అష్టమ స్థానమునందు రవి, శుక్ర, కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. మీనరాశివారు గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

WhatsApp channel

టాపిక్