Karthika Purnima 2022 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తేదీ, ముహుర్తం, ప్రాముఖ్యతలు ఇవే-karthika purnima 2022 date and muhurt and puja time and significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Purnima 2022 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తేదీ, ముహుర్తం, ప్రాముఖ్యతలు ఇవే

Karthika Purnima 2022 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తేదీ, ముహుర్తం, ప్రాముఖ్యతలు ఇవే

Karthika Purnima 2022 : కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి.. దానం చేస్తే.. పూజించినంత ఫలితం లభిస్తుందని భావిస్తారు. అయితే మరి ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ ఏరోజు వచ్చింది.. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతం ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక పూర్ణిమ

Karthika Purnima 2022 : కార్తీకమాసంలో ప్రతిరోజూ మంచిదే. అదే కార్తీకపూర్ణిమ గురించి అయితే చెప్పాల్సిన పని కూడా లేదు. కార్తీకమాసంలో.. కార్తీక పూర్ణిమను అత్యంత పవిత్రమైన, ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. కార్తీక పూర్ణిమ రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేసి.. దాన, ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే ఈ మాసం అంతా పూజించినంత ఫలితం లభిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసం విష్ణువుకు, శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కార్తీకమాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం తీసుకున్నాడని భక్తులు నమ్ముతారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కార్తీక పూర్ణిమను.. ఈ సంవత్సరం నవంబర్ 8, 2022 న జరుపుకోనున్నారు.

కార్తీక పూర్ణిమను త్రిపురారి పూర్ణిమ లేదా త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. త్రిపురాసార అనే రాక్షసునిపై శివుడు సాధించిన విజయాన్ని ఇది గుర్తుచేస్తుంది కాబట్టి. పురాణాల ప్రకారం.. శివుడు కార్తీక పూర్ణిమ నాడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఇది దేవతలను సంతోషపెట్టింది. ఆ సమయంలో విష్ణువు.. శివునికి త్రిపురారి అనే పేరు పెట్టాడు. ఇది శివుని పేర్లలో ఒకటి. త్రిపురాసుర సంహారం ఆనందంలో దేవతలందరూ స్వర్గం నుంచి దిగివచ్చి కాశీలో దీపావళి జరుపుకున్నారని భక్తులు నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఆయన అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శిస్తారు. ప్రజలు దీపాలను వెలిగించి కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. శివునికి పాలు, తేనెతో అభిషేకాలు చేస్తారు. దీనినే 'రుద్రాభిషేకం' అంటారు.

దృక్ పంచాంగ్ ప్రకారం..

కార్తీక పూర్ణిమ 2022 నవంబర్ 7, సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 8న సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది.

సంబంధిత కథనం