Karthika Masam Food Rules : కార్తీకమాసంలో తినకూడని ఆహార పదార్థాలు ఇవే..
Karthika Masam Food Rules : సాధారణంగా కార్తీక మాసం అనగానే ఉల్లిపాయలు, వెల్లుల్లి, నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలి అనుకుంటారు. అయితే వీటితో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు. మరి ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Karthika Masam Food Rules : కార్తీకమాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా చెప్తారు. ఈ మాసంలో ప్రతీరోజూ పవిత్రమైనదేనని.. ఈ సమయంలో దేవుని భక్తి శ్రద్ధలతో కొలిస్తే.. అవి వారికి నేరుగా చేరుతాయని భావిస్తారు. అందుకే ఈనెల మొత్తం భక్తులు ఉపవాసాలు, వ్రతాలు, దానాలు, పూజలు చేస్తూ ఉంటారు. భోజనం విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నెల మొత్తం ప్రత్యేకమైన డైట్ పాటిస్తారు. చాలామంది ఈ మాసంలో ఉల్లిపాయకు, నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. అయితే కార్తీకమాసంలో ఏయే రోజు ఏయే ఆహారం తీసుకోవాలో.. ఏరోజు ఏ ఆహారం దూరంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1వ రోజు
ఉల్లిపాయ, ఉసిరి, రాత్రిమిగిలినవి, ఒకరు తినగా మిగిలినవి, చల్లని పదార్థాలు తినకూడదు.
2వ రోజు
కట్ చేసిన వాటిని తినకూడదు. అంటే కూరకు కూరగాయలు తరుగుతాం కదా. అలాంటివి తీసుకోకూడదు.
3వ రోజు
సాల్ట్ వేసిన పదార్థాలు, ఉసిరికాయను తినకూడదు.
4వ రోజు
వంకాయ, ఉసిరికాయ తినకూడదు.
5వ రోజు
పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి.
6వ రోజు
మీకు ఇష్టమైన పదార్థాలతో పాటు.. ఉసిరి కూడా తినకూడదు.
7వ రోజు
ఉసిరికాయను, నమిలి తినే వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు.
8వ రోజు
ఉల్లిపాయ, ఉసిరికాయను విస్మరించాలి.
9వ రోజు
నూనెతో తయారు చేసిన వాటిని, ఉసిరికాయను తినకూడదు.
10వ రోజు
ఉసిరికాయ, గుమ్మడికాయ, నూనెతో వండిన వాటికి దూరంగా ఉండాలి.
11వ రోజు
పులుపు పదార్థాలు తినకూడదు.
12వ రోజు
ఉప్పు, కారం, పులుపు లేని ఆహారాన్ని తీసుకోవచ్చు.
13వ రోజు
ఉసిరికాయ తినకూడదు. డిన్నర్ చేయకూడదు.
14వ రోజు
ఇష్టమైన వస్తువులతో పాటు ఉసిరికాయ కూడా తినకూడదు.
15వ రోజు
కట్ చేసిన ఫుడ్ తినకూడదు.
16వ రోజు
ఉల్లి, ఉసిరి, రాత్రి వండిన భోజనం, మజ్జిగ సేవించకూడదు.
17వ రోజు
ఉల్లి, రాత్రి వండిన ఫుడ్, ఉసిరి, మజ్జిగ, కట్ చేసిన ఫుడ్ తీసుకోకూడదు.
18వ రోజు
ఉసిరికాయలు తినకూడదు.
19వ రోజు
నెయ్యి, నూనె, ఉసిరి, మైదా వంటలకు దూరంగా ఉండాలి.
20వ రోజు
పాలు మాత్రమే తీసుకోవాలి. ఇంకేమి తినకూడదు.
21వ రోజు
ఉప్పు, పులుపు కారం తినకూడదు. ఉసిరి, ఉల్లికి కూడా దూరంగా ఉండాలి.
22వ రోజు
తాగే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నమిలేవి తీసుకోకూడదు.
23వ రోజు
ఉసిరి, తులసిని సేవించరాదు.
24వ రోజు
ఉసిరి, మైదాతో చేసిన వాటికి దూరంగా ఉండాలి.
25వ రోజు
పులుపు, రసం వంటి ద్రవపదార్థాలు తీసుకోకూడదు.
26వ రోజు
సంపూర్ణ ఉపవాసం చేయాలి.
27వ రోజు
వంకాయ, ఉల్లి, ఉసిరితో చేసినవి తినకూడదు.
28వ రోజు
ఉల్లి, ఉసిరి, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయలతో చేసిన వంటలు తినకూడదు.
29వ రోజు
పగలు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే ఓపిక లేకపోతే.. ఉసిరికి మాత్రం దూరంగా ఉండండి.
30వ రోజు
పగలు ఉపవాసం చేయాలి.
సంబంధిత కథనం