Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయం, వ్యాపారాస్తులకు భారీ లాభాలు
Budhaditya raja yogam: బుధుడు, సూర్యుడి కలయిక వల్ల త్వరలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం రావడం ఖాయం. వ్యాపారాస్తులకు భారీ లాభాలు.
Budhaditya raja yogam: అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీన్ని గ్రహ సంచారం అంటారు. మే నెలలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ శుభ యోగాలు సృష్టిస్తున్నాయి.
మే నెలలో చాలా పవిత్రమైన యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. మే 14వ తేదీ శక్తి, ఆత్మకు బాధ్యత వహించే గ్రహాల రాజు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. తర్వాత మేధస్సుకి కారకుడిగా భావించే గ్రహాల రాకుమారుడు మే 31వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
వృషభ రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధాదిత్య యోగం పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. శక్తి, ధైర్యం, ప్రభుత్వ ఉద్యోగం వంటి వాటికి సూర్యుడిని మూలంగా పరిగణిస్తారు. జ్ఞానం, విద్య, మేధస్సు, ప్రసంగానికి మూలంగా బుధుడిని పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తాడు. బుధుడు జ్ఞానం, చైతన్యాన్ని అందిస్తారు. సమాజంలో గౌరవం పొందేందుకు సహాయపడుతుంది.
జాతకంలో బుధాదిత్య రాజయోగం ఉంటే జాతకులు విజయం, గౌరవం, ప్రతిష్ఠ, ఆర్థిక శ్రేయస్సు పొందుతారు. అదృష్టం, సంపద వీరిదే అవుతుంది. అటువంటి ఈ యోగం వల్ల ప్రయోజనం పొందే రాశులు గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశిలోనే గ్రహాల రాజు, రాకుమారుడి కలయిక జరుగుతుంది. ఫలితంగా వీరికి అనుకూలమైన కాలం ఏర్పడుతుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. రాశి లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడటం వల్ల సమాజంలో ప్రతిష్ఠ విపరీతంగా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కార్యాలయంలో ఎదుర్కొనే అడ్డంకులు అధిగమిస్తారు. వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమన్వయం ఉంటుంది. ప్రేమ పెరుగుతుంది. వ్యాపారవేత్తలు బుధాదిత్య రాజయోగం వల్ల ధనాన్ని, లాభాలను ఆర్జిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ యోగం మీ రాశి తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది. అదృష్టం పూర్తి మద్ధతు ఉంటుంది. పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మతపరమైన, శుభ కార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలంలో పని విజయం లభిస్తుంది.
సింహ రాశి
సూర్యుడు, బుధుడు కలయిక వల్ల ఏర్పడే ఈ రాజయోగం సింహ రాశి వారి జీవితాలలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం వ్యాపారం, వృత్తికి సంబంధించిన గృహంలో ఏర్పడుతుంది. అందువల్ల వ్యాపారస్తుల జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితంలో చాలా పురోగతి ఉంటుంది. భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉండనున్నాయి.