Sun transit: 2024 ఏడాది మొత్తం ఈ రాశుల వారికి గ్రహాల రాజు అనుగ్రహం.. భవిష్యత్ మారిపోతుంది-sun transit in this year these zodiac signs get surya bhagavan blessing ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: 2024 ఏడాది మొత్తం ఈ రాశుల వారికి గ్రహాల రాజు అనుగ్రహం.. భవిష్యత్ మారిపోతుంది

Sun transit: 2024 ఏడాది మొత్తం ఈ రాశుల వారికి గ్రహాల రాజు అనుగ్రహం.. భవిష్యత్ మారిపోతుంది

Gunti Soundarya HT Telugu
May 06, 2024 01:23 PM IST

Sun transit: గ్రహాల రాజు సూర్యుడి అనుగ్రహం 2024 ఏడాది మొత్తం కొన్ని రాశుల మీద ప్రత్యేకంగా ఉండనుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి భవిష్యత్ మారబోతుంది. అందులో మీరు ఉన్నారా లేదో చూసుకోండి.

2024 మొత్తం ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు
2024 మొత్తం ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు (pinterest )

Sun transit: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి, గౌరవం, విజయం, పురోగతి, ప్రభుత్వం రంగాలలో ఉన్నత సేవకు కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. అందుకే అన్ని గ్రహాలకు రాజుగా సూర్య భగవానుడి పరిగణిస్తారు

సంబంధిత ఫోటోలు

సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అదృష్టం రెట్టింపు అవుతుంది. నెలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ అన్ని రాశుల మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు.  జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సూర్య భగవానుడు 2024 సంవత్సరం చివరి నాటి వరకు కొన్ని రాశుల వారికి ప్రత్యేక అనుగ్రహం ఇస్తాడు. ఈ రాశుల వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. డిసెంబర్ 31, 2024 వరకు ఏయే రాశుల వారికి సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం. 

మేష రాశి

సూర్యుడి ఆశీస్సులు ఈ ఏడాది మొత్తం మేష రాశి వారికి పుష్కలంగా ఉండనున్నాయి. వృత్తి జీవితంలో దాగివున్న శత్రువులు లేదా ఇతరుల వల్ల వస్తున్న సమస్యలు సమసి పోతాయి. మేష రాశి జాతకుల ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఆర్థిక లాభాలు, ప్రమోషన్లు, వేతన పెంపు కోసం వేచి ఉన్నవారికి ఎదురవుతున్న సమస్యలు ముగిసిపోతాయి. ఈ సమయంలో వృత్తి జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు సిద్ధమవుతూ పోటీ పరీక్షలు రాస్తున్న మేష రాశి విద్యార్థులకు ఇది మంచి సమయం. 

వృషభ రాశి

గ్రహాల రాజు అనుగ్రహంతో వృషభ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న గృహ సమస్యలు అంతమవుతాయి. వృత్తి జీవితంలో చాలా ఫలవంతమైన కాలం ప్రారంభమవుతుంది. ఇది మీకు కీర్తి, హోదాని ఇస్తుంది. ఈ కాలంలో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఎదుగుదల కోసం లేదా ఉద్యోగం చేసే సంస్థలో ఏదైనా మార్పు కోసం చూస్తున్నట్లయితే అందుకు ఈ సమయం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో, సామాజికంగా, కుటుంబ పరంగా అదృష్టం కలిసి వస్తుంది. రాజకీయంగా, ప్రభుత్వపరంగా మీకు గుర్తింపు లభిస్తుంది. 

సింహ రాశి

సూర్య భగవానుడు సింహ రాశి వారికి చాలా సంతోషాన్ని, శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. కుటుంబం, పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వారి ఆనందానికి మీరు ఎన్నో పనులు చేస్తారు. కొత్తగా వివాహం చేసుకున్న స్త్రీలు తమ కుటుంబాన్ని విస్తరించడానికి ఇష్టపడతారు. అనారోగ్య సమస్యల కారణంగా గర్భం ధరించలేకపోయిన వాళ్ళకి ఈ సమయంలో అవకాశం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భం ధరించేందుకు అనువైన కాలంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులు పడుతుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. చదువుపై పూర్తి దృష్టి సాధిస్తారు. ఉన్నత విద్యలో రాణిస్తారు. సూర్యుడి అనుగ్రహంతో పని ప్రాంతంలో మీ కష్టాలు తీరిపోతాయి. తండ్రి, గురువు నుంచి మీకు చాలా మద్దతు ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. 

Whats_app_banner