సెప్టెంబర్ 27, నేటి రాశి ఫలాలు: ఒక రాశి వారు ఈరోజు సీక్రెట్ మెయింటేన్ చేయాలి, నోరుజారితే ఇబ్బందులు తప్పవు
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.09.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today 27th September 2024 Rasi Phalalu in Telugu:
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 27.09.2024
వారం: శుక్రవారం , తిథి: దశమి ,
నక్షత్రం: పుష్యమి , మాసం: భాద్రప్రద,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఆశించిన సమయంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. స్థిరాస్తుల క్రయ, విక్రయాలకి మార్గాలు ఏర్పడతాయి.
వృత్తి, ఉద్యోగాలందు అనుకూలతలు ఉన్నాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులకు పరిష్కారాలు దొరుకుతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం. బంధుమిత్రులతో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ మార్పులకు ఈరోజు దూరంగా ఉండండి.
వృషభం
శుభఫలితాలు ఈరోజు మీకు కనపడతాయి. అన్నింటా అనుకూలతలు చూస్తారు. ఇతరులు మిమ్మల్ని గౌరవించడం లేదనే భావనకి దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకోగలుగుతారు.
కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోగలుగుతారు. బంధు మిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు, నూతన పుస్తక పఠనములు వంటివి ఉంటాయి. విద్యార్థులు సమయానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. కుటుంబంలో ఈరోజు మరొకరికి ఆదాయ మార్గం కనిపిస్తుంది.
మిథునం
గ్రహసంచారాలు ఈరోజు మీకు మిశ్రమ ఫలితమిస్తాయి. అంకితభావంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి ప్రేరణను పొందుతారు. ఖర్చు సూచనలున్నాయి.
గత రుణాలతో ఈరోజు కాస్త ఒత్తిడికి గురవుతారు. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంకితభావం ఈరోజు ముందుకు సాగాలి.
కర్కాటకం
ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. అనుకున్న పనులను వేగవంతంగా చేసుకోగలుగుతారు. మీ అపికేషన్లు పరిశీలనను పూర్తి చేసుకుని ప్రయోజనాలు ఇచ్చే దిశగా సాగుతాయి.
కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉన్నా ఉత్సాహకరమైన ఫలితాలను ఈరోజు చూస్తారు. పనితీరు మార్చుకుని అధికారుల నుంచి మెప్పు పొందుతారు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.
సింహం
గ్రహ సంచారాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. అవకాశాలు కలిసి వస్తాయి. ఆలోచనలను అమలు చేయండి. ప్రభుత్వ పరమైన లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు అనువైన సమయం.
దీర్ఘకాలిక ప్రణాళికలు, లక్ష్యాల అమలుపై శ్రద్ధపెట్టాల్సిన సమయం. ఆరోగ్యంపరంగా తగు జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలలో మీదైన శైలిలో ఈరోజు ముందుకు వెళతారు.
తుల
కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇంటా బయటా సహనం, పట్టుదలతో ఈరోజు ముందుకు సాగాలి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్లానింగ్ తప్పనిసరి.
ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వైద్య సేవలు అవసరమవుతాయి. వ్యాపార, వ్యయములందు నిశితమైన దృష్టి అవసరం. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. బంధు మిత్రులతో ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు.
కన్య
ఉద్యోగాలలో చిన్న తరహా టెన్షన్లు, ఒత్తిడి ఉంటాయి. ఆర్థిక విషయాలలో చక్కగా ఆలోచనలు చేసుకోగలరు. అధికార్లు, కుటుంబ పెద్దలతో ఈరోజు కాస్త సంయమనంతో వ్యవహరించండి.
వాహనాలు, యంత్రాల మార్పులు ఉన్నాయి. కొత్త వాహనాల కొనుగోలు చేసుకోవడానికి ఈరోజు అనువైన సమయం. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈరోజు కలిసొస్తుంది. నవ దంపతులకు శుభవార్తలుంటాయి. కానీ ఈరోజు ముఖ్యమైన విషయాల్లో గోప్యత పాటించడం తప్పనిసరి. నోరుజారితే ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం
ఈరోజు గ్రహ సంచారాలు ఒత్తిడి, శ్రమలు ఇచ్చేవిగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం.
రిజర్వ్ చేసిన డబ్బుని తీయకుండా ఈరోజు కాస్త అవసరాలను వాయిదా వేసుకోండి. వ్యాపారాలలో నిరాశ వార్తలుంటాయి. అయినప్పటికీ కంగారు పడకండి. బంధు మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే సూచనలున్నాయి. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నా.. తెలియని ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త పనులు చేపట్టే ముందు ఈరోజు పునరాలోచన చేయండి. ఆరోగ్యం విషయంలో ఒకింత మంచి మార్పులు ఉన్నాయి.
మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీకు తగిన మందులు ఈరోజు దొరకవచ్చు. వ్యాపారులు నెలవారీ చెల్లింపుల్లో జాగ్రత్తలు పాటించాలి. బంధువులతో మాట పట్టింపులు రాకుండా ఈరోజు జాగ్రత్తలు అవసరం.
మకరం
అవకాశాలు ఈరోజ కలిసి వస్తాయి. ప్రయత్నాలు చేయగలిగితే మీరు ఊహించుకున్నవి పొందవచ్చు. ఆర్థికంగా క్రమంగా నిలదొక్కుకోగలుగుతారు. భూ, గృహ సంపాదనలుంటాయి. స్వల్పకాలిక లాభార్జనలు వ్యాపారులు ఏర్పరచుకోగలరు.
వ్యక్తిగతంగా, వృత్తి, ఉద్యోగాలలో ఈరోజు ప్రతిభను చూపగలుగుతారు. కుటుంబంలో అపరిష్కృత సమస్యలను పూర్తి చేసుకునేందుకు అనువైన సమయం. అన్నింటా జాగ్రత్తలు తీసుకోండి.
కుంభం
కొన్ని అదనపు పని భారాలను స్వీకరించాల్సి రావచ్చు. ఖర్చు, శ్రమ వంటివి ఈరోజు కాస్త ఎక్కువగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలందు అవకాశాలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని పనులు ఊహించని విధంగా ఈరోజు వాయిదా పడతాయి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సాగలేక సమయాన్ని వృథా చేసుకునే సూచనలున్నాయి. సంతానం వ్యవహారాలపై నిశితమైన దృష్టి అవసరం.
మీనం
కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గత పొరపాట్లని దిద్దుకునే వెసులబాటు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ముఖ్య విషయాలను అనుకూలంగా మలుచుకోగలరు.
స్థిరాస్తుల క్రయ విక్రయ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు వంటివి ఉంటాయి. అద్దె ఇంటి మార్పులు కొందరికి తప్పనిసరి అయ్యే సూచనలు ఉన్నాయి.