సెప్టెంబర్ 21, నేటి రాశి ఫలాలు- ప్రతికూలతలు అధికం, కొత్త వ్యక్తులతో జాగ్రత్త-21st september 2024 today rasi phalalu in telugu check zodiac wise results for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 21, నేటి రాశి ఫలాలు- ప్రతికూలతలు అధికం, కొత్త వ్యక్తులతో జాగ్రత్త

సెప్టెంబర్ 21, నేటి రాశి ఫలాలు- ప్రతికూలతలు అధికం, కొత్త వ్యక్తులతో జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ21.09.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 21 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 21 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 21.09.2024

వారం: శ‌నివారం, తిథి: చ‌వితి,

నక్షత్రం: భరణి, మాసం: భాద్ర‌ప‌ద‌ం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం స‌మ‌యం. సన్నిహితులు ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. కొన్ని విష‌యాల్లో మీ జోక్యం అనివార్యం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. తరుచూ వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.

వృషభం

లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించ వద్దు. అదృష్ట యోగమే మిమ్ములను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. నిలిపి వేసిన పనులు పునః ప్రారంభిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.

కర్కాటకం

ఫ‌లితాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రధాన అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. పాత మిత్రులు తారస పడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.

సింహం

ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది.

కన్య

కార్యసాధనకు పట్టుదల ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతి కష్టం మ్మీద తీరుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణ అనివార్యం. ఆరోగ్యం బాగుంటుంది.

తుల

సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాక చక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతృప్తికరంగా రోజులు గ‌డుస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి.

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉల్లాసంగా గడుపుతారు.

ధనుస్సు

వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొన్ని విష‌యాల ప‌ట్ల‌ అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. పెద్దల సలహా తీసుకోండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. తరచూ విందుల్లో పాల్గొంటారు.

మకరం

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. సంకల్ప బలమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు.

కుంభం

వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. మానసికంగా కుదుటపడతారు.

మీనం

కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్ని హితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ